చిత్ర పరిశ్రమలో వరుస మరణాలు భయభ్రాంతులను చేస్తున్నాయి. నిన్న మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ మృతి చెందారు. ఇక నేడు నటుడు శరత్ బాబు మృతి చెందారు. ఈ రెండు మరణాలనే అభిమానులు ఇంకా మర్చిపోలేదు.. తాజాగా మరో యువనటుడు మృతి చెందటం హాట్ టాపిక్ గా మారింది. పాపులర్ రియాలిటీ షో `స్ప్లిట్స్విల్లా 9` ఫేమ్ ఆదిత్య సింగ్ రాజ్ పుత్ నేడు బాత్ రూమ్ లో శవంగా కనిపించాడు. డ్రగ్స్ ఓవర్ డోస్ వలనే అతడు మృతి చెందినట్లు సమాచారం. ఆదిత్య సింగ్.. నటుడిగా, మోడల్ గా కెరీర్ ను మొదలుపెట్టాడు. ఇక స్ప్లిట్స్విల్లా 9 షో ద్వారా అతడికి మంచి పేరు వచ్చింది. ఇక ఆదిత్య డ్రగ్స్ కు బానిసగా మారాడని అతని స్నేహితులు చెప్పుకొస్తున్నారు.
Sarath Babu Passes Away: సీనియర్ నటుడు శరత్ బాబు మృతి.. సంతాపం తెలిపిన జనసేనాని
గత రాత్రి స్నేహితులతో పార్టీ చేసుకున్న ఆదిత్య.. ఉదయం బాత్ రూమ్ లో శవంగా తేలాడు. ఇక ఫ్రెండ్ మృతిపై అతడి స్నేహితుడు మాట్లాడుతూ.. తాను అంత క్లోజ్ ఫ్రెండ్ ఏమి కాదని, అతనితో ఏడాదిగా టచ్ లో లేనని చెప్పాడు. అంతేకాకుండా డ్రగ్స్ ఎక్కువగా తీసుకొని బాత్ రూమ్ లోకి వెళ్లగా.. అక్కడ మత్తులో కిందపడి.. తలకు బాగా గాయం అయ్యి చనిపోయి ఉండొచ్చని అభిప్రాయం వెళ్లబుచ్చాడు. ఇక ఆత్మహత్య చేసుకొనే అంత బాధలు అయితే అతడికి లేవని, అతనికి బ్రాండ్ విలువ బాగానే ఉందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారం చేపట్టారు. అతి చిన్న వయస్సులోనే డ్రగ్స్ కు బానిసగా మారి.. జీవితాన్ని నాశనం చేసుకున్నాడని ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.