Arvind Swamy:అందాల నటుడు అరవింద్ స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దళపతి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైనఆయన .. బొంబాయి, రోజా లాంటి సినిమాలతో మణిరత్నం ఫేవరేట్ హీరోగానే కాకుండా తెలుగువారికి కూడా అందాల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పట్లో అమ్మాయిలందరూ ఎలాంటి భర్త కావాలి అంటే అరవింద్ స్వామిలా ఉండాలి అని చెప్పేవారట.. అంతల ఆయన ప్రేక్షకులను మెప్పించాడు. ఇక అన్ని భాషల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకునం అరవింద్ స్వామి.. ప్రస్తుతం విలన్ గా మెప్పిస్తున్నాడు. ఇక తాజాగా అరవింద్ స్వామి గురించి కోలీవుడ్ నటుడు ఢిల్లీ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అరవింద్ స్వామి తన సొంత కొడుకు అని, కానీ తమ ఇద్దరి మధ్య ఆ అనుబంధం లేదని ఆయన చెప్పుకొచ్చాడు. ఏంటి నిజమా.. ? అరవింద్.. నటుడు ఢిల్లీ కుమార్ కొడుకా.. ? అంటే.. నిజమే అని తెలుస్తోంది.
Maharashtra : వీడు అసలు తండ్రేనా.. పసికందును నేలకేసి కొట్టి..
“అరవింద్ నా సొంత కొడుకు.. వాడిని చిన్నప్పుడే నా చెల్లిదత్తత తీసుకుంది. వారిదగ్గరే అతను పెరిగాడు. ఫ్యామిలీలో ఏదైనా ఫంక్షన్ ఉంటే తప్ప ఇంటికి వచ్చేహ్వడు కాదు. మేము తండ్రికొడుకులు అన్న మాటే కానీ, మా మధ్య అలాంటి అనుబంధం లేదు. మేము కలిసి దిగిన ఒక్క ఫోటో కూడా మా దగ్గర లేదు. ఇప్పటివరకు అతనితో నేను నటించింది కూడా లేదు.” అని చెప్పుకొచ్చాడు. ఇక అరవింద్ ఈ విషయాన్నీ తన కెరీర్ మొదట్లోనే మీడియా ముందు చెప్పేశాడు. తన సొంత తండ్రి ఢిల్లీ కుమార్ అని.. అప్పటినుంచి ఇప్పటివరకు అరవింద్ స్వామి తన తండ్రి గురించి ఏ రోజు మాట్లాడింది లేదు.. ఎన్నో ఏళ్ళ తరువాత ఢిల్లీ కుమార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడంతో మరోసారి ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.