Lavanya Tripathi: మెగా కోడలికి జోడీగా బిగ్ బాస్ విన్నర్.. బ్రేక్ లేకుండా షూట్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lavanya Tripathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ఆమె వివాహం అతి త్వరలోనే జరగనుంది. ఇక ప్రస్తుతం వరుణ్ కుటుంబం మొత్తం వెకేషన్ లో ఎంజాయ్ చేస్తుండగా.. లావణ్య షూటింగ్స్ లో బిజీగా ఉంది. ప్రస్తుతం లావణ్య చేతిలో ఒక వెబ్ సిరీస్.. మరో రెండు ప్రాజెక్ట్ లు ఉన్నాయని తెలుస్తోంది. నిజానికి జీ5లో స్ట్రీమింగ్ అయిన పులి మేక అనే వెబ్ సిరీస్ ద్వారా లావణ్య డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సిరీస్ ఆమెకు మంచి విజయాన్ని తీసుకొచ్చి పెట్టింది. దీని తరువాత లావణ్య స్కైలాబ్ సినిమాతో డైరెక్టర్ గా అడుగుపెట్టిన విశ్వక్ ఖండేరావు తో ఒక వెబ్ సిరీస్ లో నటించడానికి రెడీ అయ్యింది.
Bigg Boss Telugu 7: మొదటి ఎలిమినేషన్ లోనే హాట్ బ్యూటీ అవుట్.. ?
Also Read
- The India Story: మనం తినేది అన్నమా? విషమా?.. భయపెడుతున్న 'ది ఇండియా స్టోరీ' టీజర్
- Deewana: సినిమా నచ్చి బై వన్ గెట్ వన్ ఆఫర్ ప్రకటించిన హీరో శ్రీ విష్ణు
- Varanasi Update: 'వారణాసి' నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
- Shah Rukh Khan: 'నా భర్త కంటే మీరే ఇష్టం'.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
లావణ్య ప్రధాన పాత్రలో ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఈ వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చేయనుందని అంటున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సిరీస్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ కోసం ఎక్స్‌క్లూజివ్‌గా క్రియేట్ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సిరీస్ లో లావణ్యా త్రిపాఠికి జోడీగా ‘బిగ్ బాస్’ విన్నర్, శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో ఓ హీరోగా నటించిన అభిజిత్ నటించడమే. ఇక అందుతున్న సమాచారం మేరకు ఈ సిరీస్ షూట్ కూడా శరవేగంగా జరుగుతోంది. రొమాంటిక్ కామెడీ జానర్ గా లావణ్య త్రిపాఠి, అభిజిత్ ల ఈ వెబ్ సిరీస్ రూపొందుతోంది. ఇప్పటి వరకు ఈ సిరీస్ అనౌన్స్ చేయలేదు కానీ త్వరలో అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి త్వరలో ఏడు అడుగులు వేయనున్న క్రమంలో ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సిరీస్ త్వరగా ఫినిష్ చేయాలని షూటింగ్ బ్రేకులు పడకుండా శరవేగంగా చేసేస్తున్నారు.
తాజావార్తలు
-
The India Story: మనం తినేది అన్నమా? విషమా?.. భయపెడుతున్న ‘ది ఇండియా స్టోరీ’ టీజర్
-
Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్‌ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
-
IAS Transfers : తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ
-
Deewana: సినిమా నచ్చి బై వన్ గెట్ వన్ ఆఫర్ ప్రకటించిన హీరో శ్రీ విష్ణు
-
Shani Trayodashi 2026: రేపే శని త్రయోదశి.. పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయొద్దు..
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!