Sumalatha: టాలీవుడ్ సీనియర్ నటి సుమలత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఆమె కన్నడ నటుడు అంబరీష్ ను వివాహమాడి కర్ణాటకలో సెటిల్ అయిపోయింది. ఇక భర్త అంబరీష్ చనిపోయాక.. ఆయన స్థానంలో మాండ్య పార్లమెంట్ నియోజక వర్గంలో పోటీ చేసి గెలుపొందిన సుమలత అప్పటి నుండి క్రియాశీలక రాజకీయాలతో బిజీగా ఉంది. ఇక తాజాగా ఆమె కుమారుడు వివాహం ఘనంగా జరిపించింది. సుమలత కొడుకు అభిషేక్ వివాహం వ్యాపారవేత్త అయిన అవివా బిడప్పా తో బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్ లో అంగరంగ వైభవంగా జరిగింది. వీరిది ప్రేమ వివాహంగా తెలుస్తోంది. ఈ వివాహానికి అతిరథ మహారథులు హాజరయ్యారు. తెలుగు, తమిళ్, కన్నడ హీరోలతో పాటు రాజకీయ ప్రముఖులు సైతం హాజరయ్యి వధూవరులను ఆశీర్వదించారు.
Harish Rao: ఇండియన్ ఐడల్ రన్నరప్ గా సిద్దిపేట ముద్దుబిడ్డ.. ప్రశంసించిన హరీష్ రావు
ఇక ఈ పెళ్ళిలో అందరి చూపు మోహన్ బాబు, రజినీకాంత్ ల మీదనే ఉంది అంటే అతిశయోక్తి కాదు. వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం తెల్సిందే. సుమలతతో మోహన్ బాబు చాలా సినిమాలు చేశాడు. అప్పట్లో హిట్ పెయిర్ గా నిలిచారు. ఇక ఈ పెళ్ళిలో మోహన్ బాబు.. రజినీకాంత్ కలిసి కనిపించారు. వీరితో పాటు వెంకయ్య నాయుడు, రఘురామ కృష్ణంరాజు, కిచ్చ సుదీప్.. తదితరులు పాల్గొన్నారు. కొత్త దంపతులను ఆశీర్వ దించేందుకు గాను భారీ ఎత్తున కన్నడ రాజకీయ వర్గాల వారు హాజరు అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.