తెలుగు చలన చిత్రపరిశ్రమలో బ్రాండ్ అంబాసిడర్స్ లో కాస్ల్టీ ఎవరని అంటే టక్కున వినపడే పేరు మహేశ్ బాబు. మహేశ్ ఖాతాలో లెక్కలకొద్ది ఎండార్స్‌మెంట్స్ ఉన్నాయి. మహేశ్ కిట్టీలో ఎప్పుడూ డజనుకు పైగా బ్రాండ్స్ ఉంటూనే ఉంటాయి. ఈ బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నందుకు మహేశ్ కోట్లకు కోట్లు ఛార్జ్ చేస్తూ ఉంటాడు. అయితే మహేశ్ బాబు ని ఉచితంగా వాడుకుంటున్న ఏకైక సంస్థ టిఎస్ఆర్టి టిసి అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. నిజానికి టికెటింగ్ వెబ్‌సైట్ ‘అభిబస్’కి మహేశ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. ఎప్పటినుంచో ఈ యాడ్ ప్రసారమాధ్యమాల్లో ప్రదర్శితం అవుతూ ఉంది కూడా. ఈ సంస్థ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల నుండి బస్సు టిక్కెట్లను కొనుగోలు చేసి ప్రయాణీకులకు అందిస్తూ వస్తోంది. దీని ప్రచారం కోసమే మహేశ్ ని ఉపయోగించుకుంటోంది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ టి.ఎస్.ఆర్.టి.సి తమ డిజిటల్ ప్రమోషన్ కోసం మహేష్ బాబు ఆర్.టి.సి బస్సులో ప్రయాణించే క్లిప్ ను ఉపయోగించుకుని ప్రమోషన్ చేస్తోంది. ఈ సీన్ ‘శ్రీమంతుడు’ సినిమాలోనిది. మహేష్ పబ్లిక్ బస్సు ఎక్కి ప్రయాణించే సన్నివేశం ఇది. టి.ఎస్.ఆర్.టి.సి చేస్తున్న ఈ ప్రచారం కోట్లాది అభిమానులకు ఈజీగా చేరుతుందనటంలో సందేహం లేదు. ఆర్.టి.సి కమిషనర్ గా సజ్జనార్ వచ్చిన తర్వాత ఈ తరహా డిజిటల్ ప్రచారంతో సంస్థను సమర్థవంతంగా నడిపిస్తున్నారనే టాక్ ఉంది. అటు అభిబస్ వారు కోట్లు కుమ్మరించి పొందిన ప్రచారాన్ని ఇటు టి.ఎస్.ఆర్.టి.సి వారు పైసా ఖర్చులేకుండా పొందటం గమనార్హం. ఈ విషయంలో సజ్జనార్ కి హ్యాట్సాప్ చెప్పవలసిందే.
Choose #TSRTCBuses for all your travel needs @urstrulyMahesh@baraju_SuperHit @ganeshbandla@MaheshBabuNews @SVPTheFilm @ParasuramPetla @madhie1 @MaheshBabu_FC @Gopimohan#SarkaruVaariPaata #SVP #BlockbusterSVP @TarakSpace #Saturday @ChaiBisket @idlebrainjeevi @tsrtcmdoffice pic.twitter.com/FzVzhGkY2b
— TSRTC (@TSRTCHQ) May 14, 2022