పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రాధే శ్యామ్’ హిందీ మ్యూజిక్ ప్రమోషన్లు స్టార్ట్ చేశారు మేకర్స్. ఈ మేరకు హిందీ ప్రేక్షకుల కోసం మొదటి సింగిల్ ‘ఆషికి ఆ గయీ’ వీడియో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ మ్యూజిక్ వీడియో ప్రభాస్ అభిమానులకు, సంగీత ప్రియులకు విజువల్ ఫీస్ట్ లా ఉంది. లీడ్ పెయిర్ ప్రభాస్, పూజా హెడ్గేల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. వీరిద్దరి మధ్య రొమాన్స్ వెండితెరపై మ్యాజిక్ సృష్టిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. అర్జిత్ సింగ్ ‘ఆషికి ఆ గయీ’ పాటకు ప్రాణం పోసాడు. మిథూన్ సంగీతం సూపర్ గా ఉంది. విజువల్స్ హైలెట్ అని చెప్పొచ్చు. ఈ పాటను ఇటలీలోని కొన్ని అందమైన ప్రదేశాలలో చిత్రీకరించారు. ఆ సన్నివేశాలు చాలా రిచ్, గ్రాండ్‌గా ఉన్నాయి. ఈ వీడియో సాంగ్ చివర్లో హీరోయిన్ చనిపోతున్నట్టుగా హింట్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఈ పాటతో ‘రాధే శ్యామ్’పై అంచనాలు మరింత పెరిగాయి.
Read Also : “ఆర్ఆర్ఆర్” ట్రైలర్ రిలీజ్ పోస్ట్ పోన్
“రాధే శ్యామ్” నుండి వచ్చిన మొదటి సింగిల్ “ఈ రాతలే” తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఈ సినిమా ఆడియో ఆల్బమ్‌లోని రెండో పాటకు సంబంధించిన చిన్న ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. “వన్ హార్ట్ టూ హార్ట్ బీట్స్” పేరుతో ‘రాధే శ్యామ్’ ఆల్బమ్ నుండి కాసేపట్లో రాబోతున్న ఫుల్ సాంగ్ గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. “రాధే శ్యామ్” 2022 జనవరి 14న థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలు పోషించారు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు.