చిరు, బాలయ్యకు సినిమాల పరంగా పోటీ ఉంటుందేమో గానీ… చరణ్, బాలయ్య మధ్యన మాత్రం అదోరకమైన బాండింగ్ ఉంది. బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి రామ్ చరణ్ రాకపోయినా ప్రభాస్, అండ్ పవన్ టాక్ షోలలో చరణ్‌తో బాలయ్య ఫోన్ కాల్ హైలెట్‌గా నిలిచింది. ఫ్యాన్స్ మధ్య పోటీ ఉంటుందేమో గానీ తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని, తామంతా ఒకటేనని సమయం వచ్చినప్పుడల్లా చెబుతునే ఉన్నారు చిరు, బాలయ్య. ముఖ్యంగా రామ్ చరణ్, బాలకృష్ణ మధ్య ఉన్న రాపో చూస్తే ఔరా అవాల్సిందే. ఈ ఇద్దరు ఎక్కడ కలుసుకున్నా చాలా సరదాగా పలకరించుకుంటారు. గతంలో శర్వానంద్ రిసెప్షన్‌లో బాలయ్యను చూడగానే రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేశాడు చరణ్. ఆ తర్వాత దగ్గరకు వెళ్లి ఆత్మీయంగా పలకరించారు. అందుకు సంబందించిన వీడియో చాలా వైరల్‌గా మారింది. ఇక ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు పెళ్లి వేడుకలోనే కలుసుకోవడం విశేషం.
తాజాగా బ్రహ్మానందం రెండో కొడుకు సిద్ధార్థ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి చాలామంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులోను చరణ్, బాలయ్య ఎదురుపడిన వీడియో తెగ వైరల్ అవుతోంది. శర్వానంద్ పెళ్లిలో లాగే ఈ పెళ్లిలోనూ చరణ్, ఉపాసన దంపతులకు ఎదురయ్యాడు బాలయ్య. దీంతో బాలయ్యను చూడగానే అప్యాయంగా నమస్కారం చేశాడు చరణ్. బాలయ్య కూడా బ్రదర్ బ్రదర్… బ్రో అంటూ చరణ్‌ను పలకరించాడు. ప్రస్తుతం ఈ వీడియో మెగా, నందమూరి ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తోంది. మూడున్నర దశాబ్దాలుగా ప్రొఫెషనల్ రైవల్రీ ఉన్న మెగా నందమూరి కుటుంబాల మధ్య… చరణ్-బాలయ్యల మధ్య ఇంత బాండింగ్ ఉండడం చాలా మంచి విషయం. ఆన్ లైన్ ఆఫ్ లైన్ అనే తేడా లేకుండా తిట్టుకునే మెగా నందమూరి అభిమానులు, వీళ్ల మధ్య ఉన్న రిలేషన్ చూసి అయినా గొడవపడడం ఆపేస్తారేమో చూడాలి.