ఓ ఇండస్ట్రీలో హిట్ కొట్టిన సినిమాలనుమరో ఇండస్ట్రీలో రీమేక్ చేయడం కామన్. ఆ సినిమాలు హిట్ అయితే వాటి సీక్వెల్స్ విషయంలో కూడా రీమేక్స్ చేస్తుంది బాలీవుడ్. అందుకు ఎగ్జాంపుల్స్ బాఘీ, దడక్ సీక్వెల్స్ చిత్రాలు. ప్రభాస్ వర్షం సినిమాను బాఘీ పేరుతో రీమేక్ చేశాడు టైగర్ ష్రాఫ్. తెలుగులో హిట్టైన క్షణం చిత్రాన్ని బాఘీ2గా, తమిళ సినిమా వెట్టైని బాఘీ3గా ప్రేక్షకులకు అందించాడు. పేరుకు సీక్వెల్లే కానీ ఫస్ట్ కథకు.. సెకండ్ కథకు అసలు సంబంధమే ఉండదు.
Also Read : HHVM : హరిహర వీరమల్లు.. ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ ఫిక్స్.?
రాబోయే బాఘీ4 స్టోరీ కూడా సౌత్ మూలాలుండే ఛాన్స్ ఉంది. ఎందుకుంటే ఆ ప్రాజెక్టును డీల్ చేస్తోంది ఓ కన్నడ దర్శకుడు. సో పక్కా మరో సదరన్ స్టోరీతో టైగర్ ష్రాఫ్ గట్టెక్కాలని చూస్తున్నట్లే ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు దడక్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. 2016లో మరాఠిలో సూపర్ డూపర్ హిట్టైన సైరత్‌ను హిందీలో దడక్ పేరుతో రీమేడ్ చేశారు. జాన్వీ కపూర్ ఈ సినిమాతోనే బాలీవుడ్ తెరంగేట్రం చేసింది. ఫస్ట్ సినిమాతోనే వంద కోట్ల కొల్లగొట్టింది జాను పాప. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. కానీ పూర్తిగా కొత్త కథ, కథనాలతో, న్యూ ఫెసెస్‌తో దడక్ 2 తీసుకు వస్తున్నారు. ఆగస్టు 1న థియేటర్లలోకి రాబోతున్న సందర్భంగా రీసెంట్లీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. హానర్ కిల్లింగ్ నేపథ్యంలో దడక్ రాగా.. సామాజిక అసమానతలు ఉన్న అమ్మాయి, అబ్బాయి ప్రేమ కథగా రాబోతుంది దడక్2. ఇందులో సిద్దాంత్ చతుర్వేదీ, త్రిప్తి దిమ్రీ హీరోహీరోయిన్లు. కాగా, ఈ సినిమా కూడా 2018లో వచ్చిన తమిళ మూవీ పరియేరుమ్, పెరుమాళ్ రీమేక్‌గా రాబోతుంది. సీక్వెల్ విషయాల్లో కూడా సౌత్ స్టోరీలనే బేస్ చేసుకుంటోంది బాలీవుడ్.