1993 plane crash : 1993 విమాన ప్రమాదం.. ఇచ్చిన మాట తప్పిన బాలయ్య, చిరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1993లో గుండ్ల పల్లెలో జరిగిన విమాన ప్రమాదాన్ని టాలీవుడ్ ఎప్పటికి మర్చిపోదు. ఈ ఘటనలో బాలయ్య, చిరంజీవి, అల్లు రామలింగయ్య, దర్శకులు కోడి రామకృష్ణ, ఎస్వీ కృష్ణారెడ్డి తో పాటు మరికొందరు నటీమణులు కూడా ఆ విమాన ప్రమాద ఘటనలో గాయపడ్డారు. అప్పటి సంఘటన గురించి గుండ్ల పల్లె ఊరి గ్రామస్తులు, ప్రక్యక్ష సాక్షులతో నిర్వహించిన ముఖాముఖీలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అప్పటి విమాన భాగాలతో జ్ఞాపకంగా ఇంటి తలుపులు, కుర్చీలు, మంచాలు చేస్తున్న గ్రామస్థులు. విమానం విడిభాగాలను సైడ్ అద్దాన్ని భద్రంగా దాచుకున్నాం. మీ ఊరు మమ్మల్ని కాపాడింది మీకు ఏమైనా చేస్తామని చిరంజీవి బాలకృష్ణ అడిగితే హాస్పిటల్ కట్టించాలని కోరాము. వాళ్ళు హామీ అయితే ఇచ్చారు కానీ మళ్ళీ ఇటువైపు ఎప్పుడు రాలేదన్నారు గ్రామస్తులు.
విమానం ల్యాండ్ అయిన పొలం యజమాని వాసి జనార్ధన్ రెడ్డి ప్రమాదం గురించి మాట్లాడుతూ.. ‘విమానం ల్యాండ్ అయిన వెంటనే ఫైలెట్ కిందకు దిగి ఓ చెట్టు దెగ్గరకు పరుగులు తీసి ఒణుకుతూ నిల్చున్నారు. తరువాత విమానంలో ఒక్కొకరుగా కిందకు దిగారు. విమానంలో అప్పటి సీఎం మర్రిచన్నా రెడ్డి కుమార్తె, మనవరాలు ఉన్నారు. సీఎం మర్రిచన్నారెడ్డి హెలికాప్టర్ లో ప్రమాద ప్రాంతానికి వచ్చారు. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో విమాన విడి భాగాలు ఊడిపోయాయి. అల్లు రామలింగయ్య విమానం పై నిల్చొని నిదానంగా దిగండి అని అన్నారు. మా గ్రామ దేవత దేశమ్మ కి చిరంజీవి మొక్కుకొని వెళ్ళారు. విమానం ల్యాండ్ అవ్వడంతో మా పొలంలో పంట పూర్తిగా పోయింది.
Also Read
- VIJAY - TRISHA : విజయ్ - త్రిష జంటగా కనిపిస్తే ట్రోలింగ్ ఎందుకు?
- Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
- Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా 'సూరి'
- Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
అప్పటి గుండ్ల పల్లె సర్పంచ్ దేశిరెడ్డి మాట్లాడుతూ.. చిరంజీవి, బాలకృష్ణ, అల్లూరామలింగయ్య షాక్ కి గురై పొలం గట్టుపై కూర్చున్నారు. వాళ్లందరికీ తాగేందుకు మజ్జిగ, నీరు ఇచ్చాను. అల్లురామలింగయ్య చాలా భయపడ్డారు. ఏమి కాలేదు బయపడకండి అని ధైర్యం చెప్పాను. మా గ్రామస్తులే విమానంలో ఉన్నవారికి సహాయం చేశారు. మా పంటకు నష్టపరిహారం చెల్లించారు.
గుండ్ల పల్లె గ్రామస్థులు మాట్లాడుతూ.. ఉదయం స్కూల్ కి వెళ్తున్న సమయంలో మా గ్రామం వైపు భారీ శబ్దం వచ్చింది. మాకు అది విమానం అని తెలియదు, వెంటనే పరుగులు తీశాము. విమానం పొలాల్లో ల్యాండ్ అయింది, దాదాపు అర కిలోమీటరు మేర భూమిపై రాసుకుంటు వెళ్ళింది. మేము విమానం దెగ్గరకు పరుగులు తీశాము, కానీ మమల్ని దెగ్గరకు రానివ్వలేదు. అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉందని అనౌన్స్ చేశారు. మా గ్రామంలోని చెరువును, ఓ కొండను తప్పించి విమానం ల్యాండ్ అయింది. ఒకవేళ చెరువు గట్టుకు తగిలిన, చిన్న కొండను డి కొట్టిన పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ఫైలెట్ విమానాన్ని చాలా చాకచక్యంగా ల్యాండ్ చేశారు.అందరూ బురదలో చిక్కున్నారు, వారిని మేము గట్టుమీదకు తీసుకొచ్చాము. తరువాత బెటాలియన్, పోలీసులు, హెలికాప్టర్ వచ్చింది. కొంతమందిని హెలికాప్టర్ లో, ఇంకొందరిని కార్లలో తీసుకెళ్లారు. ఆ విమానం ఒక సంవత్సరం పాటు మా గ్రామంలోనే ఉంచారు. మాకు విమానం ఎక్కే అవకాశం దొరికింది. సందర్శకులు ఎక్కువ వస్తుండడంతో విమానం దగ్గర చిన్నపాటి వ్యాపారాలు చేసుకున్నారు
తాజావార్తలు
-
Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
-
VIJAY – TRISHA : విజయ్ – త్రిష జంటగా కనిపిస్తే ట్రోలింగ్ ఎందుకు?
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
-
EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్‌లోనే..
ట్రెండింగ్
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!