సూపర్ స్టార్ కృష్ణ కూతురు ఘట్టమనేని మంజుల ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. గతంలో పలు సినిమాల్లో నటించిన మంజుల ప్రస్తుతానికి నిర్మాతగా సినిమాలు చేస్తున్నారు. అయితే ఆమె ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. ఆమె వ్యక్తిగత జీవితం, పిల్లలు, వారి ఇంట్లో జరిగే వేడుకలు, సినిమాల అప్డేట్స్ వంటి విషయాలను మంజుల సోషల్ మీడియా ద్వారానే పంచుకుంటారు. అయితే తాజాగా మంజుల ఓ కొత్త బ్లాగ్ ను ఓపెన్ చేసింది. అందులో పలు ఆసక్తికర అంశాలను పంచుకుంటోంది. తాజాగా 10 బుక్స్ చదవమంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది మంజుల.
Read Also : భారీగా డ్రగ్స్ తో పట్టుబడిన ‘సింగం’ నటుడు
“నా కొత్త బ్లాగ్ – మీ జీవితాన్ని మార్చే 10 పుస్తకాలు. మీ జీవితాన్ని మార్చే పుస్తకాల జాబితా కోసం మీరు వెతుకుతున్నారా ? అయితే ఈ బ్లాగ్ మీ కోసం. నా బ్లాగ్ ఇక్కడ చదవండి” అంటూ బ్లాగ్ లింక్ షేర్ చేసింది. మీరు గనుక ఆ 10 బుక్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ బ్లాగ్ ను ఓపెన్ చేయొచ్చు.
A post shared by Manjula Ghattamaneni (@manjulaghattamaneni)