సాదారణంగా పంటి నొప్పి అనేది అందరికి వస్తుంది.. ఏదైనా గట్టిగా కొరకటం దంతాలు లేదా కలుపుల మధ్య ఏదైనా చిక్కుకోవడం వంటి వాటి వల్ల మనం పంటి నొప్పికి గురవుతాము.. దానివల్ల నొప్పి విపరీతంగా భాదిస్తుంది.. కొన్నిసార్లు మందులకు తగ్గినా కూడా మరికొన్నిసార్లు మాత్రం నొప్పి తగ్గదు.. దాంతో ఇంటి చిట్కాలను ఫాలో అవుతారు.. ఇలాంటి వారికోసం అద్భుతమైన చిట్కాను తీసుకొచ్చాము.. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పంటి నొప్పికి కారణం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, కాల్షియం లోపం లేదంటే దంతాలని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వలన ఈ సమస్య తలెత్తుతుంది. ఇలాంటి సమయంలో ఉల్లిపాయలతో పంటి నొప్పిని దూరం చేసుకోవచ్చని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు..ఉల్లిపాయలు యాంటీ బ్యాక్టీరియల్ మరియు క్రిమినసక స్వభావం కలిగి ఉంటాయి.. అలాగే పంటి నొప్పిని నియంత్రించడంలో గొప్పగా సహాయపడతాయి. ఇన్ఫెక్షన్ కలిగించే సూక్ష్మ క్రిములను చంపడం ద్వారా నొప్పి నుండి ఉపశమనాన్ని పొందవచ్చు..ఉల్లిపాయ ముక్కని తీసుకొని ప్రభావితమైన పంటిపై ఉంచండి ఆ తర్వాత ఉల్లిపాయను కొరికి దంతాల మధ్య పది నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత నోటిని నీటితో శుభ్రం చేసుకోండి.. ఇలా రోజుకు ఒకసారైనా చెయ్యడం మంచిది..
అదే విధంగా ఉల్లిపాయను రెండు ముక్కలుగా కట్ చేసి దానిమీద ఉప్పు జల్లి నొప్పి ఉన్న పన్నుపై బాగా రుద్దాలి.ఇలా చేయటం వలన నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఉల్లిపాయ, నిమ్మకాయలను కలిపి ఉపయోగించడం వల్ల కూడా అనేక దంత సమస్యలను నివారించవచ్చు.. అదే విధంగా గిన్నెలో ఉప్పు నిమ్మరసం మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి దీనిని ఉల్లిపాయ ముక్కల ద్వారా నొప్పి ఉన్న ప్రదేశంలో రుద్దాలి.ఇలా చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం పొందటమే కాకుండా పంటి నొప్పిని మెల్లగా దూరం చేసుకోవచ్చు.. ఇక నొప్పి జన్మలో రాదని నిపుణులు చెబుతున్నారు.. మీరు కూడా ఫాలో అవ్వండి..