Snoring Danger: కొంత మంది ఇలా నిద్రపోయేరో లేదో అలా గురక వస్తుంటుంది. వాళ్లు గురక మొదలు పెట్టారంటే మంచి నిద్రలోకి జారుకున్నట్లు ఇండికేషన్‌లా ఫీల్ అవుతారు. ఇక చాలు.. ఇలా అనుకోవడం వెంటనే ఆపేయండి. ఎందుకు ఇలా అంటున్నాను అంటే గురక ప్రాణాంతకం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఏంటి షాక్ అయ్యారా.. పర్లేదు కాకపోయినా ఈ స్టోరీని ఒక లుక్ వేయండి. ఎందుకంటే
READ ALSO: GST ఎఫెక్ట్.. రూ.95,500 వరకు తగ్గిన Honda కార్ల ధరలు..!
మీకు సాధారణ గురక ఉంటే పర్వాలేదు. కానీ చాలా బిగ్గరగా గురక ఉంటే ఎందుకన్నా మంచింది ఒకసారి చెకప్‌కు వెళ్లండి. లేకుంటే పరిస్థితి తీవ్రంగా మారవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. 32 ఏళ్ల రోగి బిగ్గరగా గురక పెట్టడం వల్ల నిద్రలోనే మరణించాడని డాక్టర్ అదితి ధమిజా చెప్పారు. బిగ్గరగా గురక పెట్టడం కొన్నిసార్లు ‘స్లీప్ అప్నియా’కి సంకేతం అని ఆయన చెప్పారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. ‘స్లీప్ అప్నియా’తో బాధపడే వారికి వాయుమార్గం ఇరుకుగా ఉంటుంది, దీని కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడవచ్చాని చెప్పారు. దీంతో వారిలో ఆక్సిజన్ స్థాయి గణనీయంగా తగ్గుతుందని, దీని కారణంగా గుండెపై అదనపు ఒత్తిడి పడటం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. అటువంటి పరిస్థితిలో గుండెపోటు రావచ్చని, ఇది ప్రాణాంతకం కావచ్చనే అభిప్రాయం వెల్లడించారు. స్లీప్ అప్నియా కారణంగా అధిక రక్తపోటు, స్ట్రోక్, ఇతర గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని చెప్పారు.
వెంటనే డాక్టర్‌ను కలవండి..
మీరు నిద్రపోతున్నప్పుడు బిగ్గరగా గురక రావడం లేదా మీ కుటుంబంలో ఎవరికైనా ఇలా వస్తే, దానిని లైట్ తీసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించి అవసరమైన తనిఖీ చేయించుకోవాలని చెబుతున్నారు. కొన్నిసార్లు కొందరికి పూర్తి రాత్రి నిద్ర తర్వాత కూడా అలసిపోయినట్లు అనిపిస్తుంది. దీనిని అంత తేలిగ్గా తీసుకోకుండా వైద్యుడిని సంప్రదించాలని అంటున్నారు. ఏది ఏమైనా ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకండి చెబుతున్నారు.. చూసుకోండి మరి.
READ ALSO: Odisha: భార్య వివాహేతర సంబంధం.. అర్ధనగ్నంగా ఊరేగించిన భర్త