Namo Namah Shivaya: గూజ్ బంప్స్ తెప్పిస్తున్న తండేల్ ‘నమో నమశ్శివాయ’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువ సామ్రాట్ నాగ చైతన్య మచ్ అవైటెడ్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్లు బ్లాక్ బస్టర్ నోట్లో ప్రారంభమయ్యాయి. ఫస్ట్ సింగిల్ “బుజ్జి తల్లి” సెన్సేషనల్ హిట్ అయింది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. ప్రోమోతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మేకర్స్ ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెకండ్ సింగిల్ “నమో నమః శివాయ” లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. మహాదేవ్ స్మరణతో కూడున్న శివ శక్తి పాట బ్రెత్ టేకింగ్ మాస్టర్ పీస్. ఈ సాంగ్ డ్యాన్స్, డివొషన్, గ్రాండియర్ విజువల్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది.
రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఎలక్ట్రిఫైయింగ్ బీట్స్ ఆకట్టుపడేస్తున్నాయి. ట్రాక్ పవర్ ఫుల్, భక్తి వాతావరణాన్ని క్రియేట్ చేసింది. జొన్నవిత్తుల సాహిత్యం శివుని సర్వశక్తి, ఆధ్యాత్మికత సారాంశాన్ని అద్భుతంగా చూపించింది, అనురాగ్ కులకర్ణి వోకల్స్ డైనమిక్‌గా వున్నాయి. హరిప్రియ సోల్ ఫుల్ వోకల్స్ తో ఆకట్టుకుంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ మరొక హైలైట్, ఇది మరపురాని అనుభూతిని కలిగిస్తుంది. డ్యాన్స్ ద్వారా భక్తి గాథను అందంగా వివరిస్తూ, శివునికి పవిత్రమైన బ్యాక్ డ్రాప్ లో కొరియోగ్రఫీ ఆకట్టుకుంది.
‘లవ్ స్టోరీ’లో తమ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న లీడ్ పెయిర్ నాగ చైతన్య, సాయి పల్లవి ఈ పాటలో మెస్మరైజ్ చేశారు.
Also Read
- Hanuman Ansh: రూ.452 కోట్లు కొల్లగొట్టినా ఎవరూ పట్టించుకోలేదు.. ‘హనుమాన్ అంశ్’ డైరెక్టర్ అసంతృప్తి!
- Samantha: సమంత, రాజ్ దంపతులకు పండంటి మగబిడ్డ.. ముద్దుల కుమారుడి పేరు ఇదే..
- Shiva Kandukuri Marriage: టాలీవుడ్లో పెళ్లిళ్ల సందడి.. పెళ్లిపీటలెక్కబోతున్న మరో హీరో!
- Chiranjeevi Letter: మెగాస్టార్ చిరంజీవి లేఖ.. అమిత్ షాకు అందజేసిన కిషన్ రెడ్డి!
నాగ చైతన్య పవర్ ఫుల్ ప్రెజెన్స్, సాయి పల్లవి అత్యద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ ప్రేక్షకులుని అలరించాయి. గ్రాండ్ సెట్స్ ఎక్స్ పీరియన్స్ ని మరింత పెంచుతుంది. సెట్ డిజైన్, మ్యాజెస్టిక్ బ్యాక్‌డ్రాప్‌లు కన్నుల విందుగా వున్నాయి. నమో నమః శివాయ పాట కళాత్మక, ఆధ్యాత్మిక కలయిక తో లార్డ్ శివ గ్లోరీని సెలబ్రేట్ చేస్తుంది. ఈ ట్రాక్ బిగ్గెస్ట్ చార్ట్బస్టర్లలో ఒకటిగా నిలవనుంది.ఈ మూవీకి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు, షామ్‌దత్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటర్. శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. తండేల్ ఫిబ్రవరి 7న విడుదల కానుంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Live Day-7 : కోటి దీపోత్సవం ఏడో రోజు.. నేడు త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణం
-
Ajit Doval: అజిత్ దోవల్‌కు అమెరికా కోర్టు సమన్లు.. భారత్ తీవ్ర అభ్యంతరం..
-
Pakistan Minister: తాజ్ మహల్, నిజాముద్దీన్ దర్గాకు వెళ్లాలనుకున్న పాక్ మంత్రి.. ‘నో’ చెప్పిన భారత్..
-
Crystal Crop: క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ ఐపీవోకు విశేష స్పందన.. చివరి రోజు 17.06 రెట్లు సబ్స్క్రిప్షన్
-
Wildlife Protection : మీకు నెమలి దొరికితే ఇలా మాత్రం చేయకండి.. వికారాబాద్ ఘటనతో కీలక అవగాహన
-
Delhi: పెళ్లి చేసుకోవాలని ఇన్ఫ్లుయెన్సర్ ఇంట్లోకి చొరబడ్డ యువకుడు.. కొట్టి చంపిన బంధువులు.
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!