ఒక్కొక్కరిది ఒక్కో అభిరుచి. కొందరికీ చక్కెరతో చేసిన టీ, కాఫీ, ఇతర స్వీట్ డ్రింక్స్ తాగాలంటే ఇష్టం. మరికొందరు బెల్లంతో చేసిన పానీయాల్ని ఎంతో ఇష్టంగా తాగుతారు. ముఖ్యంగా.. ఫిట్నెస్‌పై దృష్టి పెట్టేవాళ్ళు చక్కెరను దూరం పెడుతంటారు. వీరితో పాటు షుగర్ వ్యాధిగ్రస్తులు సైతం.. చక్కెరను పక్కన పెట్టేసి, ఇతర ఆరోగ్యకరమైన స్వీట్నర్లను వాడుతారు. ఆ స్వీట్నర్లలో ప్రధానంగా బెల్లంనే ఎంపిక చేసుకుంటారు. ఇందులో పొటాషియం, ఐరన్, పాస్ఫరస్, మెగ్నీషియం, ఇంకా ఇతర విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే.. కొన్ని రకాల స్వీట్లు, పచ్చళ్లలో కూడా బెల్లాన్ని వినియోగిస్తుంటారు.
అయితే.. బెల్లం టీ తాగితే మాత్రం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆయుర్వేదం చెప్తోంది. దీనివల్ల జీర్ణక్రియ దెబ్బతింటుందట! పాలు శరీరాన్ని చల్లబరిస్తే.. బెల్లం వేడిచేస్తుంది. ఇలా భిన్న స్వభావాలు కలిగిన పదార్థాల్ని కలిపి తీసుకున్నప్పుడు.. అది జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది. మరి.. చక్కెర, బెల్లం కాకుండా ఏం తీసుకోవాలి? అనేగా మీ సందేహం.. ఆ రెండింటికి ‘పటిక బెల్లం’ (Rock Candy) ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయమని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇది పాలలాంటి శీతలీకరణ శక్తిని కలిగి ఉంటుందిని వాళ్ళు చెప్తున్నారు. ఇది జీర్ణక్రియపై ఎలాంటి ప్రభావం చూపదని, ఆరోగ్యకరమైన సమస్యలూ రావడని పేర్కొంటున్నారు.
మరోవైపు.. పాలు – చేపలు, తేనె – నెయ్యి, పెరుగు – జున్ను, అరటిపండు – పాలు మొదలైనవి విరుద్ధ కలయిక ఆహార పదార్థాలని నిపుణులు చెప్తున్నారు. ఈ కలయికల్ని ఏమాత్రం తీసుకోవద్దని సూచిస్తున్నారు. ఇవి కడుపులో మంటను ప్రేరేపించడంతో పాటు.. తీవ్రమైన సందర్భాల్లో ఆటో ఇమ్యూన్ వ్యాధులకు కూడా దారి తీయొచ్చని అంటున్నారు. కాబట్టి.. తస్మాత్ జాగ్రత్త!