ఒక మేకప్ కిట్ ని మనం వాడుగుతున్నప్పుడు.. దాన్ని కొన్ని నెలలు మాత్రమే ఉపయోగించాలి. వాటికి లైఫ్ ఫ్యాన్ చాలా తక్కువగా ఉంటుంది.. మస్కారా లాంటి వాటికి ఇంకా తక్కువగా ఉపయోగించాలి.. మేకప్ ను వినియోగించే వారు జాగ్రత్తగా చూసి టైం అయిపోయిన తర్వాత వాటిని పారేసి కొత్తది కొనుక్కోవడం ఉత్తమం. లేకపోతే లేనిపోని సమస్యలన్నీ మీ చర్మానికి వచ్చి చుట్టుకుంటాయి. మీరు మేకప్ వేస్తున్నప్పుడు దాని వాసనని తరచుగా చూడాలి.. దాంట్లో వాసన ఏమైనా మారుతుంది అని తెలిస్తే దాన్ని అక్కిడితో వాడొద్దు.. అది పాడైపోతుందని అర్థం చేసుకోవాలి.
Read Also: Naga Suseela: హీరో నాగార్జున చెల్లెలిపై పోలీసు కేసు.. అసలు ఏమైందంటే?
అలాంటి టైంలో మీ మేకప్ కిట్ ను మార్చేయడం చాలా బెటర్. మనం ఒక మేకప్ ప్రోడక్ట్ కొన్నప్పుడు దాని ఎక్స్పైరీ డేట్ తెలియకపోతే కొన్ని నెలలు పాటు ఉపయోగించి ఆ తర్వాత దాన్ని మార్చివేయాలి. ఎందుకంటే ఒక మేకప్ కిట్ ను సంవత్సరం కన్నా ఎక్కువ వాడిన తర్వాత అది ఎక్స్పైర్ అయిందో.. లేదో మనకి తెలియకపోతే వాడడం చాలా డేంజర్.. అందుకే దాన్ని తొందరగా మార్చేయడం బెటర్. మనం మేకప్ కిట్ వాడుతున్నప్పుడు అది రోజురోజుకీ ఒరిజినల్ షేప్, కలర్ తగ్గుతుంది. కొన్ని రోజులకి అది ఎప్పుడైతే దాని సొంత రంగు రూపులని రిలీజ్ చేస్తుంది అనేది చూడాలి.
Read Also: Italy Earthquake: ఇటలీలోని ఫ్లోరెన్స్‌లో భూకంపం.. పరుగులు తీసిన జనం
అప్పుడు అలాంటి మేకప్ చాలా ప్రమాదకరమైనందిగా గుర్తించి.. వెంటనే దాన్ని పూర్తిగా మార్చుకోవాలి.. పైన ఉన్న ఈ సూచనల ప్రకారం మీ దగ్గర ఉన్న మేకప్ కిట్ మంచిదో.. హనికరమైందో చూసి ఒకవేళ పైనున్న లక్షణాలు ఏవి ఉన్నా సరే వెంటనే మీ మేకప్ కిట్ ను మార్పు చేసుకోవడం ఉత్తమం. లేకపోతే అదే మేకప్ కిట్ ను మీరి ఉపయోగించినట్లయితే.. మీ స్కిన్ పై ఎఫెక్ట్ పడుతుంది. అందుకే మేకప్ కిట్ కొనేటప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే మనం ఇంటికి తెచ్చుకున్న కొద్దిరోజులకే మేకప్ కిట్ వ్యాలిడిటీ అయిపోతుంది. ఆ మేకప్ కిట్ తో మేకప్ వేసుకోవడం వలన లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఒకటికి పది సార్లు చెక్ చేసుకుని మేకప్ ప్రోడక్ట్స్ తీసుకోవడం ఎంతో అవసరం ఉంది.
NOTE: ఇంటర్నెట్ లో దొరికిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము.. ప్రయత్నించేముందు.. సంబంధిత నిపుణుల సలహాలు పాటించగలరని మనవి.. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీ తెలుగు. కామ్ బాధ్యత వహించదు..