సినిమాల పరిస్ధితి ఏమంత ఆశాజనకంగా లేదు. ఆడియెన్స్ థియేటర్స్ కు రావడమే తగ్గించేశారు. ఎదో మౌత్ టాక్ బాగుండి ఖచ్చితంగా చూడాలి అంటేనే ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్ కు కదలడం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలు అంటే శాటిలైట్ రైట్స్ కోసం ఫుల్ డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు శాటిలైట్ రైట్స్ అమ్మకం అనేది గగనం అయిపోయింది. ఇక బడా సినిమాల నిర్మాతలు కాస్త కూస్తో ఓటీటీ సంస్థలు డిజిటల్ రైట్స్ నుండి గట్టెక్కేవారు. స్టార్ హీరోల సినిమాల బడ్జెట్ లో సగం వరకు ఓటీటీ రూపంలో తిరిగి వచ్చేస్తాయి. కానీ అదంతా ఒకప్పుడు, ఇప్పుడు శాటిలైట్ సంస్థలు కూడా ఆచి తూచి కొనుగోలు చేస్తున్నాయి. చిన్న సినిమాలు అయితే కనీసం పే పర్ వ్యూ ప్రకారం కూడా తీసుకోవడం లేదు.
Also Read : RAPO22 : ఆంధ్రా కింగ్ తాలూకాతో ర్యాపో గట్టెక్కుతాడా..?
నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటీటీలు చిన్న హీరోల సినిమాలు కొనుగోలు చేయడమే మానేశాయి. స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే ఓటీటీలు భారీ ధర పెడుతున్నాయి. ఒకవేళ ఆ సినిమాలు థియేటర్ లో ప్లాప్ ఆయితే ముందు చెప్పిన రేట్ లో సగానికి పైగా కోతలు పెడుతున్నాయి. తాజాగా ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. సౌత్ సినిమాలను అధిక ధరలకు కొనుగోలు చేయడంలో తమ డబ్బును వృధా చేసుకోకూడదని నిర్ణయించుకుంది. బదులుగా సౌత్ సినిమా ఇండస్ట్రీలో అనేక వెబ్ సిరిస్ లు, రియాల్టీ షోలు మరియు ఒరిజినల్ కంటెంట్ మూవీస్ నిర్మించాలని భావిస్తోంది నెట్ ఫ్లిక్స్. అందుకోసం హైదరాబాద్‌లో నూతన కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసింది నెట్ ఫ్లిక్స్. ప్రధానంగా సౌత్ ఇండస్ట్రీ నుండి మంచి ఒరిజినల్ కంటెంట్‌ను నిర్మించనుంది. నెట్ ఫ్లిక్స్ తీసుకున్న ఈ నిర్ణయం ముఖ్యంగా తెలుగు, తమిళ నిర్మాతలకు షాక్ అనే చెప్పాలి. అందుకు కారణం ఇతర ఓటీటీలతో పోలిస్తే నెట్‌ఫ్లిక్స్ ప్రీమియం ధరలను అందిస్తుంది. ఇక నుండి నెట్‌ఫ్లిక్స్ నుండి భారీ ధరలు రాకపోవచ్చు. పెద్ద సినిమాల నిర్మించే నిర్మాతలు భారీ బడ్జెట్ సినిమాలు చేయాలంటే కాస్త ఇబ్బందే, లేదా స్టార్లు వారి జీతం తగ్గించుకోవలసి వస్తుంది.