శరీర ఆరోగ్యానికి ఐరన్ చాలా ముఖ్యం. ఐరన్ లేకపోవడం వల్ల హిమోగ్లోబిన్ లోపం ఏర్పడుతుంది. దీని కారణంగా రక్తహీనత వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. హిమోగ్లోబిన్ తగ్గితే, రక్తహీనత, అలసట, బలహీనత, తలతిరగడం వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల, హిమోగ్లోబిన్ లోపాన్ని అధిగమించడానికి ఆహారంలో కొన్ని పండ్లను చేర్చుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు. హిమోగ్లోబిన్ పెంచుకోవడానికి ఐరన్, విటమిన్ సి, ఇతర పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ పోషకాలన్నీ పండ్లలో పుష్కలంగా లభిస్తాయి.
Also Read:AICC: ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్.. సినీ నటికి అవకాశం!
ఆపిల్
రోజు ఒక ఆపిల్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటారు నిపుణులు. ఆపిల్ లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి కూడా ఉంటుంది. ప్రతిరోజూ ఒక ఆపిల్ తినడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది.
దానిమ్మ
దానిమ్మలో ఐరన్, కాల్షియం, ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ మొత్తాన్ని పెంచడంలో సహాయపడుతుంది, రక్తహీనతను నివారిస్తుంది. దానిమ్మ రసం తాగడం వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది.
Also Read:Madness for reels: ఇదేం పిచ్చి.. రీల్స్ కోసం గ్యాస్ సిలిండర్ లీక్, ఇళ్లు ధ్వంసం..
అరటిపండు
అరటిపండులో ఐరన్, మెగ్నీషియం, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇది హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. అరటిపండులో ఉండే విటమిన్ బి6 శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.
బీట్‌రూట్
బీట్‌రూట్ లో ఐరన్, ఫోలిక్ ఆమ్లం, ఫైబర్ ఉంటాయి. ఇది రక్తహీనతను అధిగమించడంలో, హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. బీట్‌రూట్ రసం తాగడం వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది.
Also Read:SSMB 29: కష్టమంతా వృధా.. బాబు వీడియో లీక్.. వారిపై గట్టి చర్యలు!
జామ
జామకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో, శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.
నారింజ
నారింజ విటమిన్ సి కి పెట్టింది పేరు. విటమిన్ సి శరీరంలో ఐరన్ శోషణను పెంచుతుంది. తద్వారా హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. నారింజ రసం తాగడం వల్ల రక్తహీనత రాకుండా ఉంటుంది.
Also Read:Best Recharge Plans: 90 రోజుల వ్యాలిడిటీతో బెస్ట్ ప్లాన్స్.. జియో హాట్‌స్టార్ ఉచితం
కివి
కివిలో విటమిన్ సి, ఐరన్, ఫోలేట్ పుష్కలంగా ఉన్నాయి. ఇది హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో, శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడుతుంది. కివి తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది.
మామిడి
మామిడిలో ఐరన్, విటమిన్ సి మెండుగా ఉంటాయి. ఇది హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
Also Read:HCL: కూతురు రోష్ని నాడర్‌కి 47% తన వాటాని గిఫ్ట్‌గా ఇచ్చిన శివ్ నాడార్..
పుచ్చకాయ
పుచ్చకాయలో ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో, శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. పుచ్చకాయ తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది.