ఆరోగ్యంగా ఉండటానికి సమతుల్య ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో.. శరీరం చురుకుగా ఉండటానికి వ్యాయామం కూడా అంతే ముఖ్యం. శరీర చురుకు దనం కోసం రోజూ కొంత సమయం పాటు శారీరక శ్రమ చేయాలి. శరీర శ్రమలో నడక సులభమైన మార్గం. రోజూ కొంత దూరం నడవడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అలాగే శరీరం కూడా దృఢంగా ఉంటుంది. అయితే.. నడిచే విధానం ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది. కొందరు వేగంగా నడుస్తారు. మరికొందరు నెమ్మదిగా నడుస్తుంటారు. అయితే ఇటీవల వేగంగా నడిచే వ్యక్తులకు సంబంధించి ఓ పరిశోధన బయటకు వచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
READ MORE: Devansh: చదరంగంలో సీఎం చంద్రబాబు మనవడు దేవాన్ష్ ప్రపంచ రికార్డు
ఊబకాయం, కొవ్వు వ్యర్థాలు లేదా రెండు సమస్యలతో బాధపడుతున్న 25 వేల మందిపై జపాన్‌లోని దోషిషా విశ్వవిద్యాలయంలో ఒక అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనంలో వారు ప్రజల నడక వేగం గురించి సమాచారం తీసుకున్నారు. ఈ అధ్యయనంలో వేగంగా నడిచే వారికి గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం తదితర సమస్యలు చాలా తక్కువగా ఉంటాయని తేలింది. సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనంలో నడక వేగం, ఆరోగ్యం మధ్య ఉన్న సంబంధంపై సమాచారం సేకరించారు. మాములు నడక కంటే కూడా వేగంగా నడవటం వల్ల ఇతర అనేక పెద్ద పెద్ద వ్యాధులను కూడా దరి చేరకుండా చేస్తుంది. గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యల ముప్పు నుంచి రక్షించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
READ MORE: Allu Aravind: ఇంటి దగ్గర ఎవరు గొడవ చేసినా.. పోలీసులు రెడీగా ఉన్నారు
వేగంగా నడవటం వల్ల ఏరోబిక్ ఆక్టివిటీ పెరుగుతుంది. రోజూ 10 వేల అడుగులు నడవటం వల్ల గుండె సంబంధిత, అకాల మరణాల ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. బీపీ, కొలెస్ట్రాల్ సైతం నియంత్రణలో ఉంటాయి. వాకింగ్ చేయడం వల్ల ఒత్తిడి దూరం అవుతుంది. నరాల పనితీరు మెరుగుపడుతుంది. వేగంగా నడవటం వల్ల మెదడు పనితీరుపై అనుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది మూడ్ స్వింగ్స్, జ్ఞాపకశక్తి, నిద్రకు మేలు చేస్తుంది. స్పీడ్ వాకింగ్ కండరాల బలాన్ని పెంచడంలో ఎంతో సహాయపడుతుంది. సాధారణంగా గుండె, రక్త నాళాలపై తీవ్రమైన ఒత్తిడి కలిగినప్పుడు స్ట్రోక్ వచ్చే ప్రమాదముంది. వేగంగా నడిచే అలవాటు ఉన్నవారిలో బరువు కంట్రోల్‌లో ఉంటుంది.