చలికాలంలో ఆరోగ్యం పరిరక్షించుకోవడం ఎంతో అవసరం. వాతావరణంలో మార్పుల వల్ల ఆరోగ్యం దెబ్బతింటూ వుంటుంది. మన ఆహారంలో అల్లం ఎంతో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అల్లంని క్రమం తప్పకుండా వాడితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. చిన్న అల్లంని ముక్కలుగా కట్ చేసి, గోరువెచ్చని నీటిలో కానీ, ఒక కప్పు ఛాయలో కానీ, వంటలలో కానీ కలిపి వాడడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
మనం కూరగాయల కొనేటప్పుడు తప్పనిసరిగా అల్లం కొంటుంటాం. తీవ్రమయిన స్థూలకాయంతో బాధపడేవారు ఉదయం అల్లం రసం తాగడం వల్ల అనూహ్యంగా బరువు తగ్గిపోవచ్చంటే నమ్ముతారా? ఆరోగ్యానికి అల్లం ఎంతో అవసరం. టీలో అల్లం వాడితే ప్రయోజనం వుంటుంది. మసాలాలో ఎక్కువగా అల్లం వాడతారు. అల్లం వల్ల అజీర్తి తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అల్లంలో ఉండే యాంటీ ఇంఫ్లమేటరీ గుణాల వల్ల శరీరంలో మంటను వేగంగా నివారించుకోవచ్చు.
ఉదయం లేవగానే తరచుగా వికారంగా అనిపించే వారు అల్లం తినాలి. నేరుగా అల్లం తినలేని వాళ్లు బెల్లం, చక్కెరతో చేసిన అల్లంమురబ్బా తింటుంటారు. ఉదయం ఒక ప్లేట్లో అల్లం మురబ్బా తీసుకుని అమ్మడానికి వచ్చేవారిని మనం చూస్తుంటాం. గర్భిణీ లు, కీమోథెరపీ చేయించుకునేవారు దీని నుండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.ప్రతీ రోజు అల్లం తీసుకోవడం ద్వారా కండరాల నొప్పిపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. రోజూ అల్లం తీసుకోవడం వల్ల కండరాల నొప్పి తగ్గుతుంది.మలబద్దకంతో బాధపడే వారికి అల్లం మంచి దివ్య ఔషధం.
అల్లం తినడం ద్వారా పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని అరికట్టవచ్చు. అల్లం తీవ్రమైన కడుపు నొప్పి నుండి ఉపశమనానికి సహాయపడుతుంది.గొంతు నొప్పితో బాధపడేవారు అల్లం తినాలి. అల్లంతో ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి కాబట్టి అల్లంని మీ రోజువారి ఆహారంలో భాగంగా చేసుకుని మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి.