White Hair To Black Hair: ఈ చిట్కాలు పాటిస్తే మీ తెల్లజుట్టు నల్లగా మారడం గ్యారంటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో మంచి ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో, అందాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. అందునా జుట్టు రాలిపోవడం, పొట్ట పెరిగిపోవడం మామూలైపోయింది. జుట్టు గురించి యువతీ, యువకులు ఎంతో జాగ్రత్త పడతారు. అయినా మన ఆహారపు అలవాట్లు, వాతావరణ పరిస్థితుల కారణంగా జుట్టు రాలిపోవడం, చిన్నవయసులోనే జుట్టు తెల్లబడడం జరిగిపోతోంది. దీంతో యువత ఇబ్బంది పడుతున్నారు. బయటకు వెళితే వయసు పెద్దదిగా అనిపిస్తుంది. తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు ఎన్నో చిట్కాలు ఉపయోగిస్తారు. చాలామంది గోరింటాకు మిశ్రమం చాలా బాగా పనిచేస్తుందని చెబుతారు.
* గోరింటాకుల పొడిలో కాస్త పెరుగు, ధనియాలు, మెంతులు, కాఫీ పొడి, తులసి రసం, పుదీనా రసం వేసి బాగా కలపాలి. అలాగే ఈ మిశ్రమాన్ని ఒక పావుగంట పాటు ఉడికించాలి. రాత్రంతా కూడా దాన్ని అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయం పూట ఈ మిశ్రమాన్ని మీ తలకు రాసుకుని, మూడు గంటల తరువాత తలస్నానం చేయాలి. ఇలా మీరు వారంలో రెండు సార్లు చేయడం వల్ల మంచి ఫలితం వుంటుంది. దీనివల్ల తెల్ల జుట్టు చాలా ఈజీగా నల్లగా మారుతుంది.
Also Read
- Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
- Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే 'పనసకాయ దమ్ బిర్యానీ' రుచి చూసేయండి.!
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
* ఉసిరికాయ ఇంకా అలాగే కొబ్బరినూనె మిశ్రమం కూడా దీనిపై బాగా పనిచేస్తుంది. మీరు ఉసిరికాయలలోని గింజలను తీసేసి ఎండబెట్టాలి. ఆ ఎండిన ఉసిరికాయలు కొన్నిటిని తీసుకుని పొడిగా చేసుకోవాలి. ఆ పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని దాన్ని పావు కప్పు కొబ్బరినూనెలో వేసి వేడి చేయాలి. వేడిచేసిన నూనెని రాత్రంతా కూడా అలాగే వదిలేయాలి. ఇక మరుసటి రోజు ఆ మిశ్రమాన్ని వడకట్టి ఆ తరువాత వచ్చే నూనెను సేకరించి మీ జుట్టుకు బాగా రాయాలి. ఇలా రాసిన తరువాత ఒక అర గంటపాటు ఉంచి శుభ్రంగా తలస్నానం చేయాలి. వారానికి మూడుసార్లు ఇలా చేయండి చాలు.. మీ జుట్టు నిగనిగలాడుతుంది. తెల్లజట్టు తగ్గుతుంది.
Read Also: Rice Research: కొత్తరకం సాంబమసూరి వరి వంగడం .. సాధారణం కన్నా అధిక దిగుబడి
* జుట్టును నల్లగా మార్చడంలో బ్లాక్ టీ బాగా పనిచేస్తుంది. పాలు కలపకుండా తయారు చేసిన బ్లాక్ టీ లో కాస్త ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని నెమ్మదిగా మీ తలకు బాగా పట్టించాలి.అది బాగా జుట్టు కుదుళ్లకు తగిలేలా రాయడం చాలా అవసరం. అర గంట పాటు అలాగే ఉంచి తలస్నానం చేయాలి.. ఇలా వారానికి రెండుమూడుసార్లు చేయాలి. ఇలా చేయడం వల్ల ఇతర జుట్టు సమస్యలు కూడా రావు.
* వంటల్లో మనం రోజూ వాడే కరివేపాకు జుట్టుకు పోషణ ఇస్తుంది, వెంట్రుకలు రాలకుండా చేస్తుందంటే మీరు నమ్ముతారా? చుండ్రును నివారిస్తుంది అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజు ఓ 10, 15 లేత కరివేపాకులను పచ్చిగానే తినడం అలవాటు చేసుకుంటే జుట్టు కుదుళ్లు గట్టి పరిచేందుకు కావలసిన పోషకాలు సమృద్ధిగా అందుతాయని సలహా ఇస్తున్నారు. కరీవేపాకును డైరెక్ట్ గా తినలేకపోతే మజ్జిగలో వేసి మిక్సీ చేస్తే మొత్తం కలిసి పోతుంది. అందులో చిటికెడు ఉప్పు, జీలకర్ర కూడా జోడిస్తే రుచిగానూ ఉంటుంది. ఆ జ్యూస్ తాగేస్తే మంచిది. ఆరోగ్యానికి ఆరోగ్యం, జుట్టు నల్లబడుతుంది.
* కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. కరివేపాకులో ఉండే బీటా కెరోటిన్, ప్రోటీన్ కంటెంట్ బాగుంటుంది. దీనిని పేస్ట్ లా చేసుకుని తలకు బాగా పట్టించడం వల్ల మెలనిన్ తయారీ బాగుంటుంది. మన జుట్టు నల్లగా ఉండడానికి ఈ రసాయనమే కారణం. కరివేపాకులో అమైనో యాసిడ్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది వెంట్రుకల కుదుళ్లను బలంగా ఉంచుతుంది. అర కప్పు కరివేపాకు, అర కప్పు మెంతి ఆకులను తీసుకొని దానికి కొద్దిగా నిమ్మరసం జోడించి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆపేస్ట్ని తీసుకుని తల అంతా రాసి అరగంట అలాగే ఉంచుకోవాలి. తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఎటువంటి దుష్ప్రభావాలు లేని, తేలికైనా, చవక అయిన చిట్కా. వారానికి ఒకసారి ఈ చిట్కాలు పాటించడం మంచిది. చుండ్రు సమస్య ఉన్నవారికి ఇది మంచి ఉపాయం.
Read Also: Nagababu Sattires on Ambati Rambabu Dance Live: అంబటి రాంబాబు డ్యాన్స్ పై నాగబాబు సెటైర్లు
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!