Over Eating: కొందరికి ఆకలి లేకపోవడంతో బాధపడుతుండగా, మరికొందరికి ఎంత తిన్నా తరుచూ ఆకలి వేస్తుంది. ఆకలిగా అనిపించకపోవడానికి, చాలా ఆకలిగా అనిపించడానికి వివిధ కారణాలు ఉన్నాయి. అయితే చాలా మంది ఈ రెండు సమస్యలతో బాధపడుతున్నారు. ఒక్కోసారి అతిగా తింటే మన ఇంట్లో వాళ్ళు తిడతారు. తిండిపోతు లాంటి వాడని అంటారు. కానీ బయటి వాళ్లకు మన సమస్య అర్థం కాదు అందుకే అలా అంటున్నారు.ఒక్కోసారి అర్ధరాత్రి లేచి ఆకలి వేస్తుంది.. ఏదో ఒకటి తింటాం. దీని వల్ల ఒక్కోసారి మన మీద మనకే కోపం వస్తుంది. ఇలా అతిగా తినడం వల్ల భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇంత ఆకలి ఎందుకు అని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒత్తిడి వల్ల ఆకలి వస్తుందని కొందరు అనుకుంటుండగా, పోషకాహార లోపం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మనం తినే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా తరచుగా ఆకలి సమస్యకు చెక్ పెట్టవచ్చని డైటీషియన్లు చెబుతున్నారు.
Read also: Bandi Sanjay: నేడే కొల్లాపూర్ లో బండి సంజయ్ పర్యటన.. షెడ్యూల్ ఇదే
ఇలా చేయండి..
* బాదంపప్పులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు మరియు ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. బాదంపప్పును తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది మరియు విటమిన్-E , మోనోశాచురేటెడ్ కొవ్వు ఆహారంలో మెరుగుపడుతుంది.
* మనం తినే ఆహారంలో కొబ్బరికి సంబంధించిన పదార్థాలను తీసుకోవడం ద్వారా తరచుగా వచ్చే ఆకలి బాధలను దూరం చేసుకోవచ్చు. కొబ్బరిలోని మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్‌లో క్యాప్రిక్, క్యాప్రిలిక్, క్యాప్రోయిక్ మరియు లారిక్ యాసిడ్‌లు ఉంటాయి. కొబ్బరిలో పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల కడుపు నిండిన అనుభూతిని పెంచుతుందని, ఇది అతిగా తినడాన్ని నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
* మొలకలు ఆరోగ్యానికి మంచివని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా మంది మొలకలను నానబెట్టి తింటారు. మొలకలలో ప్రోటీన్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల పూర్తిగా ఆకలి వేసిన అనుభూతి కలుగుతుంది. మొలకలలో ఉండే ప్రోటీన్ కంటెంట్ మనకు కావల్సిన శక్తిని అందిస్తుంది. ఈ పదార్థాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఆకలి బాధలను నివారించేందుకు మన డైట్ ప్లాన్‌లో మొలకలను చేర్చుకోవడం మంచిది.
* మజ్జిగ ప్రోబయోటిక్ యొక్క గొప్ప మూలం అని చెప్పబడింది. ఇందులో వెయ్ ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. మనల్ని ఎక్కువసేపు హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. మజ్జిగలో ఉండే అధిక కాల్షియం మరియు ప్రొటీన్లు మనకు కావాల్సిన శక్తిని అందిస్తాయి.
* రకరకాల కూరగాయలతో తయారుచేసే జ్యూస్‌లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా అవిసె గింజలతో చేసిన రసం చాలా ఆరోగ్యకరమైనది. కాగా.. మనం తినే రోజూవారి డైట్ లో స్వల్ప మార్పులు చేసుకుని.. పై వాటిని జోడిస్తే ఎక్కువుగా ఆకలివేసే సమస్యకు చెక్ పెట్టొచ్చు.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
VeeraSimhaReddy Public Talk: వీరసింహారెడ్డి రివ్యూ & పబ్లిక్ టాక్