కాలీఫ్లవర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఎన్నో రకాల వంటలను చేసుకోవచ్చు.. ముఖ్యంగా స్నాక్స్ ను ఎక్కువగా చేస్తారు..అయితే వీటితో చేసే కొన్ని వంటలను కొందరు ఇష్ట పడరు.. కానీ ఇతర కూరగాయల వలె కాలీఫ్లవర్ ను కూడా తప్పకుండా ఆహారంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కాలీఫ్లవర్ లో కూడా ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. దీనిలో పొటాషియం, క్యాల్షియం, ప్రోటీన్స్, పాస్పరస్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. కాలీఫ్లవర్ ను తీసుకోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గి జీర్ణశక్తి మెరుగుపడుతుంది..
అలాగే దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలోని మలినాలు, విష పదార్థాలు తొలగిపోయి శరీరం శుభ్రపడుతుంది. రోజూ ఉండయం పరగడుపున కాలీఫ్లవర్ జ్యూస్ ను తాగడం వల్ల క్యాన్సర్ వంటి సమస్యల బారిన పడకుండా ఉంటాము. అంతేకాకుండా కాలీఫ్లవర్ ను తీసుకోవడం వల్ల దంత సమస్యలు తగ్గుతాయి.. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, బరువు తగ్గడంలో కూడా కాలీఫ్లవర్ మనకు దోహదపడుతుంది..
ఎముకలను, దంతాలను దృడంగా ఉంచుకొనేందుకు ఇవి సహాయపడతాయి..కాలీఫ్లవర్ ను తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికి హైపర్ థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు దీనిని తీసుకోకపోవడమే మంచిది. కాలీఫ్లవర్ ను తీసుకోవడం వల్ల టి3, టి4 హార్మోన్లు మరింత ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. అలాగే కాలీఫ్లవర్ లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది.. మూత్ర పిండాల్లో రాళ్లు కూడా తగ్గుతాయి.. ఇన్ని ప్రయోజనాలు ఉన్న కాలిప్లవర్ ను ఒక్కసారైనా తినడం అలవాటు చేసుకోండి..