Kitchen Hacks: ఫ్రిజ్‌లో పెట్టిన కొత్తిమీర త్వరగా పాడవుతోందా? ఇలా చేస్తే వారాల తరబడి ఫ్రెష్‌గా ఉంటుంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kitchen Hacks: ఏ వంటల్లో అయినా కొత్తిమీరకు ప్రత్యేక స్థానం ఉంటుంది. కూరలు, పప్పులు, చట్నీలు, సూప్‌లు.. ఇలా ఏ వంటకమైనా చివర్లో కొద్దిగా కొత్తిమీర వేస్తే ఆ రుచి, సువాసన వేరుగా ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ వంట రుచి, సువాసన మరింత పెరుగుతుంది. అయితే మార్కెట్ నుంచి తీసుకొచ్చిన కొత్తిమీర రెండు మూడు రోజుల్లోనే వాడిపోవడం, పసుపు రంగులోకి మారడం, కుళ్లిపోవడం అనే సమస్యలు చాలా మంది మహిళలకు ఎదురయ్యే సాధారణ సమస్య. కానీ కొన్ని సులభమైన స్టోరేజ్ టిప్స్ పాటిస్తే మీ ఫ్రిజ్‌లో ఉన్న కొత్తిమీరను వారాల పాటు తాజాగా ఉంచుకోవచ్చని మీకు తెలుసా. తెలియక పోతే ఇప్పుడే తెలుసుకోండి మరి..
* ముందుగా మార్కెట్ నుంచి తీసుకొచ్చిన కొత్తిమీర కట్టను విప్పి, పసుపు రంగులోకి మారిన, ఎండిపోయిన లేదా కుళ్లిన ఆకులను తొలగించాలి. అవసరమైతే పొడవుగా ఉన్న వేర్లను కొద్దిగా కత్తిరించవచ్చు కూడా. ముఖ్యంగా స్టోర్ చేసే ముందు కొత్తిమీరను కడగకూడదు. తేమ ఉంటే అది త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ కొత్తిమీర తడిగా ఉంటే, కాటన్ గుడ్డ లేదా పేపర్ టవల్‌పై దానిని కొద్దిసేపు ఆరబెట్టాలి.
Also Read
- Idol Cleaning Tips : గణేష్ చతుర్థికి ఇంట్లోనే విగ్రహాలకు ఇలా కొత్త మెరుపు
- Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
- Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
- Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
* ఆ తర్వాత పూర్తిగా పొడిగా ఉన్న ఎయిర్‌టైట్ ప్లాస్టిక్ లేదా గాజు డబ్బా తీసుకుని అడుగున డ్రై టిష్యూ పేపర్ పరచాలి. దానిపై కొత్తిమీరను క్రమంగా అమర్చి, మళ్లీ పైభాగంలో మరో టిష్యూ పేపర్ ఉంచి డబ్బాను బిగుతుగా మూసి ఫ్రిజ్‌లోని వెజిటబుల్ క్రిస్పర్‌లో పెట్టాలి. ప్రతి మూడు నుంచి నాలుగు రోజులకు ఒకసారి టిష్యూ పేపర్ తడిగా మారిందో లేదో చూసి అవసరమైతే కొత్తది మార్చాలి.
* డబ్బా ఉపయోగించకూడదనుకుంటే కొత్తిమీరను శుభ్రమైన కాటన్ గుడ్డ లేదా న్యూస్పేపర్లో సున్నితంగా చుట్టి, జిప్‌లాక్ బ్యాగ్ లేదా ఎయిర్‌టైట్ కంటైనర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చు.
* మరో సులభమైన పద్ధతి ఏమిటంటే… కొత్తిమీరను కడిగి వేర్లు తొలగించిన తర్వాత, కాడల భాగాన్ని నీరు ఉన్న గ్లాసులో ఉంచి ఫ్రిజ్‌లో నిల్వ చేయడం. ఈ విధానం కూడా కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా ఉండేందుకు అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ చిన్నచిన్న కిచెన్ టిప్స్ పాటిస్తే కొత్తిమీర త్వరగా పాడవకుండా, ఎక్కువ కాలం పచ్చగా, తాజాగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.
తాజావార్తలు
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
-
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!