చలి పులి పంజా విసురుతోంది. తెలంగాణ వణికిపోతోంది. ఉష్ణోగ్రతలు అంతకంతకూ తగ్గుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌కు పడిపోతోందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. చలికి జాగ్రత్తగా ఉండాలని, స్వెట్టర్లు, మఫ్లర్లు వాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాని వణికిస్తున్న చలికి జనం ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు. రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు సంగారెడ్డి జిల్లాలో నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహిర్ లో 4.6 డిగ్రీలు, నల్లవల్లిలో 5.7 డిగ్రీలు నమోదైంది. న్యాల్ కల్ లో 5.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్ లో 7.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్ జిల్లా శివ్వంపేట, నర్సపూర్ లలో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది.
Read Also: Adilabad Safe District: ఆదిలాబాద్.. దేశంలోనే సురక్షితమయిన జిల్లా
ఇటు ఉత్తరాది చలికి వణికిపోతోంది. దట్టమైన పొగ మంచు, తీవ్రమైన చలి గాలులతో ఉత్తరాది ముసుకుతన్నింది. వాయవ్య, మధ్య, తూర్పు భారతంలో దట్టమైన పొగ మంచు తెరలు అలముకోవటంతో రోడ్డు, రైల్వే, విమాన మార్గాల ప్రయాణాలపై ప్రభావం చూపుతుంది. ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ప్రాంతంలో ఆదివారం 1.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అవసరమయితే తప్ప ఉదయం బయటకు రావద్దంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.ఈ సీజన్‌లో ఎన్నడూ చూడనంతగా చలి తీవ్రత రాబోయే రోజుల్లో ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరభారతదేశంలో వీస్తున్న చలి గాలుల ప్రభావంతో రాష్ట్రంలోనూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నట్లు వెల్లడించింది. ఎల్లో అలర్ట్ జారీచేసింది వాతావరణ శాఖ.
ఇటు ఆదిలాబాద్ జిల్లాలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జనవరి 11 వరకు రాష్ట్రంలో చలి కొనసాగుతుందని ఐఎండీ హైదరాబాద్ శాఖ తెలిపింది. జనవరి 9,10 తేదీల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదయ్యే అవకాశముందని తెలిపింది. ఈ మేరకు ఉత్తరాంధ్రలోని ఆదిలాబాద్, నిర్మల్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి జిల్లా పై చలి పంజా విసిరింది. జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చాలా చోట్ల సింగిల్ డిజిట్ కు కనిష్ట ఉష్ణోగ్రత లు పడిపోయాయి. కొమురం భీం జిల్లా లో 4.8గా నమోదయింది. ఆదిలాబాద్ జిల్లాలో 5.6 డిగ్రీలు, నిర్మల్ జిల్లా 6.8 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా లో 8.5గా కనిష్ట ఉష్ణోగ్రత లు నమోదయ్యాయి. దీంతో చలికి వణికిపోతోంది ఏజెన్సీ.
Read also: Russian Ukrainian War: ప్రతీకారం తీర్చుకున్న రష్యా.. 600మంది ఉక్రెయిన్ల హతం