భోజన ప్రియులు కొత్త వంటకాల పై మొగ్గు చూపిస్తున్నారు.. కొత్తగా రకరకాల రైస్ లను తయారు చేస్తున్నారు. అందులో గీ రైస్, దాల్ రైస్, జీరా రైస్ ఇలా కొత్తగా చేస్తారు.. కొందరు మాత్రం పెప్పర్ రైస్ ను కూడా చేస్తారు.. మిరియాలు ఆరోగ్యానికి చాలా మంచిది.. ఎన్నో సమస్యలను నయం చేస్తుంది.. అయితే మిరియాల రైస్ తీసుకొనే వారు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి చూద్దాం..
మిరియాలలో పొటాషియం, మెగ్నీషియం, ఇనుము, విటమిన్ కె మరియు విటమిన్ C సమృద్దిగా ఉంటాయి. ఇది చాలా ఘాటుగా ఉండటమే కాక అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మిరియాలు జీర్ణక్రియ, దగ్గు తో పాటుగా జలుబు వంటి సమస్యలు దూరం అవుతాయి.. అంతేకాక మిరియాల్లో ఖనిజ కంటెంట్ మరియు యాంటీబయాటిక్ లక్షణాలు ఉంటాయి.. అందుకే కనీసం ఒకసారైన ఈ మిరియాలను వంటల్లో చేర్చుకోవడం మంచిదని ఆరోగ్య ప్రముఖులు చెబుతున్నారు..
Bihar News : బీహార్‌లో కుప్పకూలిన మరో వంతెన.. మోతిహారిలో రూ.కోట్లు నీళ్లపాలు.. వారంలోనే మూడోది
మిరియాల రైస్ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. రోజువారీ ఆహారంలో మిరియాలను చేరిస్తే చర్మం, జుట్టు మెరుగుదలకు సహాయపడుతుంది. జలుబు దగ్గు గొంతు గరగర ముక్కు దిబ్బడ జీర్ణశక్తిని పెంచటం గొంతును శుభ్రపరచటం కీళ్లనొప్పులు వంటి సమస్యలు తగ్గిపోతాయి.. అంతేకాదు మిరియాలలో యాంటి ఆక్సిడెంట్ సమృద్దిగా ఉండుట వలన లైన్స్, ముడతలు, నల్లని మచ్చలు, అకాల వృద్ధాప్య చిహ్నాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి చర్మాన్ని రక్షిస్తుంది… ఇంకా అనేక సమస్యలను దూరం చేస్తుంది..