Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
- FSSAI కొత్త నిబంధనలు అమల్లోకి
- తుప్పు కత్తులపై పూర్తి నిషేధం
- ఫుడ్ గ్రేడ్ పరికరాలే తప్పనిసరి
- నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Food Grade Knives : మీరు హోటల్, రెస్టారెంట్, రోడ్‌సైడ్ ధాబా, స్వీట్ షాప్, ఫుడ్ ఫ్యాక్టరీ , చిన్న టిఫిన్ సెంటర్ లాంటి ఎలాంటి ఆహార వ్యాపారాన్ని (FBO) నడుపుతున్నా ఈ వార్త ఖచ్చితంగా మీ కోసమే. దేశవ్యాప్తంగా ఉన్న ఆహార వ్యాపార నిర్వాహకులందరూ తమ వంటశాలలలో కేవలం ‘ఫుడ్ గ్రేడ్’ , తుప్పు పట్టని కత్తులు, బ్లేడ్లు, కోసే పరికరాలను మాత్రమే ఉపయోగించాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కఠినమైన ఆదేశాలు జారీ చేసింది.
Also Read
- Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
- Mouth Ulcer Causes: నోటి పూత తగ్గడం లేదా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. డాక్టర్ల హెచ్చరిక
- Homemade Olive Oil: ఖరీదైన ఆలివ్ ఆయిల్‌కు గుడ్‌బై.. ఇంట్లోనే తయారు చేసుకునే సింపుల్ పద్ధతి ఇదే!
- Door Lock Care Tips: వానలకు మీ ఇంటి తాళాలు పాడవుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మెరిపించండి!
అనేక ప్రాంతాలలో ఇప్పటికీ తుప్పు పట్టిన, విరిగిన , పాడైపోయిన కత్తులతో ఆహార పదార్థాలను కోసి ప్రాసెస్ చేస్తున్నారని తనిఖీలలో వెల్లడైంది. ఇది ఆహార నాణ్యతను దెబ్బతీయడమే కాకుండా ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలిగిస్తోందని FSSAI ఆందోళన వ్యక్తం చేసింది.
ఆరోగ్యానికి ముప్పు తెచ్చే పాత పరికరాలు
ఆహార భద్రతా సంస్థ నిర్వహించిన తనిఖీల నివేదికల ప్రకారం.. కొన్ని ఆహార వ్యాపారాలలో పగుళ్లు వచ్చినవి, రంగు ఊడిపోతున్న , తుప్పు పట్టిన పరికరాలను యథేచ్ఛగా వాడుతున్నారు. ఇలాంటి లోపభూయిష్టమైన వస్తువులను ఉపయోగించడం వల్ల వాటిలోని లోహ కణాలు, రసాయనాలు , హానికరమైన బ్యాక్టీరియా ఆహారంలోకి సులభంగా ప్రవేశిస్తాయి. ఇది ఆహారాన్ని కలుషితం చేసి, వినియోగదారులకు అనేక రకాల ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. అందుకే వంట , ఆహార తయారీ కోసం తుప్పు పట్టిన, రంగు మారిన, పాడైపోయిన కత్తులు, పాత్రల వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేసింది.
FSSAI జారీ చేసిన నాలుగు ముఖ్యమైన సూచనలు
ఫుడ్-గ్రేడ్ సాధనాలు మాత్రమే: ఆహారాన్ని కత్తిరించడానికి, తొక్క తీయడానికి , ప్రాసెస్ చేయడానికి కేవలం ఫుడ్-గ్రేడ్ , తుప్పు-నిరోధక పదార్థాలతో (స్టెయిన్లెస్ స్టీల్ వంటివి) తయారు చేసిన కత్తులు, బ్లేడ్లను మాత్రమే వాడాలి.
పరికరాల పరిశుభ్రత: అన్ని కోత పనిముట్లను ఎల్లప్పుడూ శుభ్రంగా , పరిశుభ్రమైన స్థితిలో ఉంచాలి. వాటిపై ఎలాంటి తుప్పు, పగుళ్లు, అరుగుదల , రంగు ఊడిపోయే లోపాలు ఉండకూడదు.
లోపభూయిష్టమైన వాటి తొలగింపు: ఏదైనా కత్తి , బ్లేడు తుప్పు పట్టినట్లు, విరిగినట్లు , దెబ్బతిన్నట్లు గుర్తిస్తే దానిని వెంటనే వాడకం నుండి తొలగించి, దాని స్థానంలో కొత్తదాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
క్రమం తప్పకుండా క్రిమిసంహారక ప్రక్రియ: ఆహార పదార్థాలు కలుషితం కాకుండా ఉండటానికి కత్తులు, కత్తెరలు, చాపింగ్ బోర్డులను వేడి నీటిలో కడిగి, క్రిమిసంహారక ద్రవంతో , సబ్బు ద్రావణంతో క్రమం తప్పకుండా క్లీన్ చేయడం ఎంతో అవసరం.
కత్తులను శుభ్రంగా ఉంచుకునే చిట్కాలు
వంటగదిలోని కత్తులు ఎక్కువ కాలం మన్నికగా, తుప్పు పట్టకుండా ఉండటానికి కొన్ని సులువైన చిట్కాలను పాటించవచ్చు. కత్తుల నుండి మొండి మరకలను, తుప్పును వదిలించడానికి గోరువెచ్చని నీరు , నిమ్మరసం మిశ్రమాన్ని ఉపయోగించి కొద్దిసేపు నాననివ్వాలి. ఆ తర్వాత స్పాంజితో రుద్దితే అవి సులభంగా క్లీన్ అవుతాయి. ప్రతిసారి కూరగాయలు , మాంసం కోసిన వెంటనే, ఆలస్యం చేయకుండా కత్తిని గోరువెచ్చని నీరు, గిన్నెలు కడిగే సబ్బుతో కడిగి శుభ్రమైన పొడి గుడ్డతో తుడవాలి. కత్తులను ఎప్పుడూ తడిగా ఉన్నప్పుడు , ఇతర పాత్రలతో కలిపి పడేయకూడదు. వాటిని ఎల్లప్పుడూ బాగా ఆరబెట్టిన తర్వాతే ప్రత్యేకమైన కత్తుల పెట్టెలో (నైఫ్ బాక్స్) భద్రపరుచుకోవాలి.
తాజావార్తలు
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Helicopter Crash: కూలిన హెలికాప్టర్.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్, ఐదుగురు అమెరికా పౌరులతో సహా ఏడుగురు మృతి
-
IT Raids: హైదరాబాద్ టు హాంగ్‌కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
-
Melania Trump: అమెరికా అధ్యక్షుడి భార్య ఎక్కడ? నెల రోజులుగా కనిపించని మెలానియా ట్రంప్!
-
Gold Price Today: ఒక్కరోజే రూ.4,300 పెరిగిన బంగారం ధర.. వెండి కూడా భగ్గుమంటోంది!
ట్రెండింగ్
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!