Touching Elders Feet: పెద్దల కాళ్లకు నమస్కారం చేయడం.. కేవలం సంప్రదాయమేనా.! శాస్త్రీయ కోణం కూడా ఉందా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Touching Elders Feet: భారతీయ సంస్కృతిలో పెద్దల కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం అనేది తరతరాలుగా కొనసాగుతున్న ఆచారం. సాధారణంగా దీనిని గౌరవానికి ప్రతీకగా భావిస్తారు. అయితే కొందరు నిపుణులు ఈ సంప్రదాయానికి శారీరక, మానసిక ఆరోగ్యంతో సంబంధం ఉన్న కొన్ని శాస్త్రీయ కోణాలు కూడా ఉన్నాయని అంటున్నారు. మరి ఆ వివరాలేంటో ఒకసారి చూసేద్దామా..
మన శరీరం అనేక నరాలు, కణాలు, విద్యుత్ సంకేతాలతో పనిచేసే ఒక సంక్లిష్ట వ్యవస్థ. పాదాలు, చేతివేళ్లలో అనేక నరాల చివరలు (Nerve Endings) ఉంటాయి. పెద్దల పాదాలను తాకి నమస్కరించే సమయంలో ఈ నరాలు ఉత్తేజితమవుతాయని భావిస్తారు. దీనివల్ల శరీరంలో ప్రశాంతతను కలిగించే నాడీ వ్యవస్థలు చురుకుగా మారే అవకాశం ఉంది. వంగి నమస్కరించే సమయంలో మనం శరీరాన్ని ముందుకు వంచుతాం. ఈ భంగిమ వినయాన్ని పెంపొందించడమే కాకుండా.. శరీరంలో రక్తప్రసరణపై కూడా కొంత ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా విశ్రాంతి, ప్రశాంతతకు సంబంధించిన వ్యాగస్ నరం (Vagus Nerve) చురుకుదనానికి ఇది సహకరిస్తుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి.
Also Read
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
పెద్దల పట్ల గౌరవంతో నమస్కరించడం వల్ల మనలో వినయం, కృతజ్ఞత వంటి సానుకూల భావనలు పెరుగుతాయి. దీని ఫలితంగా కోపం, అహంకారం, ఆందోళన వంటి ప్రతికూల భావోద్వేగాలు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ మానసిక ప్రశాంతతను పెంపొందించడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. పెద్దలు ఆశీర్వదిస్తూ తలపై చేయి ఉంచినప్పుడు కలిగే స్పర్శ మనసుకు ఆత్మీయతను కలిగిస్తుంది. ఇలాంటి సానుకూల స్పర్శల వల్ల బంధాలను బలోపేతం చేసే ఆక్సిటోసిన్ (Oxytocin), సంతోషానికి సంబంధించిన సెరటోనిన్ (Serotonin), ఎండార్ఫిన్స్ (Endorphins) వంటి రసాయనాల విడుదల అవుతాయని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.
అంతేకాదు.. స్పృహతో కూడిన సానుకూల స్పర్శ, ఆప్యాయతతో కూడిన సంభాషణలు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. దీనివల్ల శరీరంలో ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ (Cortisol) హార్మోన్ స్థాయులు తగ్గే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!