ఓఆర్ఎస్ పేరుతో విక్రయించే అన్ని పండ్ల ఆధారిత డ్రింక్స్, ఎలక్ట్రోలైట్ డ్రింక్స్, రెడీ-టు-సర్వ్ పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్‌లను మార్కెట్లు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి వెంటనే తొలగించాలని భారత ఆహార భద్రత అండ్ ప్రమాణాల అథారిటీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. చాలా కంపెనీలు తమ పండ్ల రసాలను లేదా ఎలక్ట్రోలైట్ పానీయాలను ‘ORS’ పేరుతో అమ్మడం ద్వారా వినియోగదారులను తప్పుదారి పట్టిస్తున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇవి నిజమైన ఓరల్ రీహైడ్రేషన్ పరిష్కారాలు కావు అని నిపుణులు…
ప్రముఖ స్వీట్ షాపులో అయితే ఎలాంటి కల్తీ ఉండదు.. నాసిరకం ఉండదని అందరూ అనుకుంటారు. కానీ ఇక్కడ కూడా కల్తీ జరుగుతుందని విషయం ఇప్పుడు బయటపడింది.. ఎందుకంటే ప్రముఖ స్వీట్ షాపులకు సరఫరా చేస్తున్నా తయారీ కేంద్రం పైన ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు.. ఈ సోదాల్లో భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.. మల్లాపూర్ లోని అమన్ స్వీట్స్ తయారీ కేంద్రం పైన ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు.. భయంకరమైన నిజాలతో వెంటనే…
Baba Ramdev : బాబా రామ్‌దేవ్‌కి చెందిన పతంజలి ఫుడ్స్ లిమిటెడ్‌కి చెందిన ఎర్ర కారం పొడిలో లోపాలు కనుగొనబడిన నేపథ్యంలో, ఆహార భద్రతా సంస్థ FSSAI సూచనలను అనుసరించి, కంపెనీ తన మార్కెట్‌లోని నాలుగు టన్నుల ఎర్ర కారం పొడిని రీకాల్ చేయాలని నిర్ణయించింది.
విజయవాడ రైల్వే స్టేషన్ FSSAI నుండి '5 స్టార్ ఈట్ రైట్ స్టేషన్' సర్టిఫికేట్ పొందింది.. విజయవాడ రైల్వే స్టేషన్ అత్యుత్తమ పరిశుభ్రత మరియు సురక్షితమైన ఆహార పద్ధతులను అమలు చేసినందుకు భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల అథారిటీ (FSSAI) నుండి ప్రతిష్టాత్మకమైన 'ఈట్ రైట్ స్టేషన్' ధృవీకరణను పొందింది.
Packaged drinking water: ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ప్యాకేజ్డ్ డ్రింకింగ్, మినరల్ వాటర్‌ను ‘‘హై రిస్క్ ఫుడ్ కేటగిరీ’’లో చేర్చింది. ఇలా వర్గీకరించడం వల్ల ఈ ఉత్పత్తులను తప్పని సరిగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఈ ఉత్పత్తుల కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) నుంచి ధ్రువీకరణ అవసరాన్ని తొలగించాలని ప్రభుత్వం అక్టోబర్‌లో నిర్ణయించింది.
బొప్పాయి భారతదేశంలో విరివిగా తినే పండు. మెత్తగా, తీపిగా, జ్యూసీగా ఉండే ఈ పండును చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. ఎందుకంటే దీన్ని తినడానికి పెద్దగా శ్రమ అవసరం లేదు. బొప్పాయి రుచికరమైనది మాత్రమే కాదు, పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇది అనేక వ్యాధులతో పోరాడడంలో సహాయపడుతుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తుంది. ఆరోగ్యానికి అవసరమైన బొప్పాయిలో ఆ పోషకాలన్నీ ఉంటాయి.
రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాల్ని మరింత పెంపొందించడానికి భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (Food Safety and Standards Authority of India)తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.88.41 కోట్లతో మంగళవారంనాడు ఢిల్లీలో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ సమక్షంలో ఎఫ్ఎస్ఎస్ఎఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) జి.కమలవర్ధనరావు, ఏపీ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ సి.హరికిరణ్, ఎఫ్ఎస్ఎస్ఎఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇనోషి శర్మ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
Vijayawada Durga Prasadam: బెజవాడ కనక దుర్గమ్మ గుడికి వచ్చిన సరుకులను మరోసారి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఎఐ) అధికారులు వెనక్కి పంపించారు. 200 బాక్సుల కిస్ మిస్ ను వెనక్కి పంపినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు.
అన్నవరం ప్రసాదానికి అరుదైన గుర్తింపు లభించింది.. 133 ఏళ్ల నుంచి తయారవుతున్న సత్యదేవుని ప్రసాదానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తింపు వచ్చింది.. ఎక్కడ రాని ఈ రుచికి భక్తులు ఎంతో ఆస్వాదిస్తూ ఉంటారు.. సాంకేతికంగా అన్ని రంగాల్లో మార్పులు వచ్చినా.. ఇక్కడ మాత్రం విస్తరాకులలోనే స్వామివారి ప్రసాదాలను విక్రయాలు చేస్తారు..