Health: అందంగా కనిపించేందుకు మనం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాము. ఎవరు ఏ క్రీం చెప్తే ఆ క్రీం వాడుతుంటాం. ఇంట్లో ఉన్న పధార్ధాలతో రకరకాల రెమిడీస్ చేస్తుంటాం. చివరికి అవి ఏవి వర్కవుట్ కాలేదని బాధపడుతుంటాం. అయితే ఉప్పు ఆరోగ్యాన్ని అందిస్తూ అందాన్ని పెంచుతుంది. ఉప్పు అందాన్ని పెంచడమేటి అనుకుంటున్నారా.. అవును ఇది నిజం. పింక్ సాల్ట్ ఆరోగ్యానికి చాలా మంచింది. అలానే అందాన్ని కూడా పెంచుతుంది. మరి ఆ పింక్ సాల్ట్ విశేషాలు ఏంటో ఎప్పుడు చూదాం.
Read also:Healthy: ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి..?
పింక్ సాల్ట్ హిమాలయ పరిసర ప్రాంతాల్లో విరివిగా లభిస్తుంది. అందుకని ఈ సాల్ట్ ని హిమాలయ సాల్ట్ అని కూడా అంటారు. ఇది చూడడానికి మామూలు రాళ్ళ ఉప్పుల కనిపిస్తుంది. కానీ ఇది లేత పింక్ కలర్ లో ఉంటుంది . ఇందులో ఐరన్ ఆక్సైడ్ అధికంగా ఉంటుంది అందుకే ఇది లేత పింక్ కలర్ లో కనిపిస్తుంది. మామూలు ఉప్పుతో పోలిస్తే ఇందులో సోడియం తక్కువగా ఉంటుంది. అలానే ఖనిజ లవణాలైన పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం మొదలైనవి కూడా ఇందులో కొద్ది మోతాదుల్లో ఉంటాయి. అందుకే సాధారణ ఉప్పు కంటే పింక్ సాల్ట్ ని వాడడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సాల్ట్ వాడడం వల్ల రక్తపోటుని నియంత్రణలో ఉంటుంది. అలానే హార్మోన్లను క్రమబద్దీకరించడంలో పింక్ సాల్ట్ ఉపయోగ పడుతుంది , అలానే జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది. అంతే కాదు ఇందులో డీటాక్సిఫికేషన్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. కావున చర్మకణాల మధ్య ఇరుక్కుపోయిన దుమ్ము, కాలుష్యం, బ్యాక్టీరియా వంటి వాటిని లోతు నుంచీ శుభ్రం చేసి చర్మం లోపల నుంచి మెరిసేలా చేస్తుంది.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.