Calcium-Rich Foods: పాల కంటే 8 రెట్లు ఎక్కువ కాల్షియం.. రోజుకు కొంచెం తిన్నా ఎముకలు ఉక్కులా మారతాయి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Calcium-Rich Foods: ఎముకలు, దంతాలు గట్టిగా ఉండాలంటే రోజూ పాలు తాగాలని చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కాల్షియం లోపం అనగానే చాలామంది ముందుగా పాల వైపే చూస్తారు. కానీ వయసు పెరిగే కొద్దీ ఎముకలు గుల్లబారి, కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడకుండా ఉండాలంటే కేవలం పాలపైనే ఆధారపడాల్సిన పనిలేదు. నిజానికి పాల కంటే దాదాపు 8 రెట్లు ఎక్కువ కాల్షియం ఇచ్చే ఆహారం మన వంటింట్లోనే ఉంది. 100 గ్రాముల పాలలో కేవలం 125 మిల్లీగ్రాముల కాల్షియం మాత్రమే దొరుకుతుంది. కానీ మన వంటల్లో వాడే కొన్ని సాధారణ ఆహారాల్లో అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుందని కొందరు పోషకాహార నిపుణురాలు చెబుతున్నారు. పాలు ఇష్టం లేనివాళ్లు, పాలు పడనివాళ్లు రోజువారీ ఆహారంలో ఈ 6 రకాలను చేర్చుకుంటే ఎముకలు ఉక్కులా మారడం ఖాయం అని అంటున్నారు.
కాల్షియం విషయంలో నువ్వులకు సాటిలేదని చెప్పొచ్చు. పొట్టు తీయని 100 గ్రాముల నువ్వులలో ఏకంగా 975 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది అంటే పాల కంటే దాదాపు 8 రెట్లు ఎక్కువ. రోజుకు ఒక చెంచా నువ్వులు లేదా నువ్వుల ఉండ తిన్నా శరీరానికి భారీగా కాల్షియం అందుతుంది. పైగా వీటిలో ఉండే మెగ్నీషియం.. శరీరంలో విటమిన్-డిని యాక్టివ్ చేసి, కాల్షియం ఒంటికి బాగా పట్టేలా సాయపడుతుంది.
Also Read
- Mushroom Pulao Recipe: ప్రోటీన్ ఫుల్, టేస్ట్ సూపర్..! అన్నం ముద్దవ్వకుండా బిర్యానీకి మించిన రుచితో 'మష్రూమ్ పులావ్'..!
- Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
- Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే 'మసాలా పన్నీర్ పరాటా' ఇలా చేసుకోండి..!
- Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
రాగులను ‘కాల్షియం పవర్ హౌస్’ అని పిలుస్తారు. 100 గ్రాముల రాగుల్లో సుమారు 344 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. చిన్నపిల్లల నుంచి మహిళలు, వృద్ధుల వరకు అందరి ఎముకలు బలపడటానికి రాగి జావ, రాగి రొట్టె లేదా రాగి దోసె రూపంలో రోజూ తీసుకోవడం ఎంతో మేలు చేస్తుంది.
ఉపవాసాల సమయంలో ఎక్కువగా వాడే రాజగిరలో 100 గ్రాములకు 215 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. గ్లూటెన్ లేని ఈ ధాన్యంలో ఫాస్ఫరస్, లైసిన్ లాంటి పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. ఇవి బలహీనపడిన ఎముకలను రిపేర్ చేయడానికి, మరింత దృఢంగా మార్చడానికి బాగా పనికొస్తాయి.
తాజా మునగాకులో ప్రతి 100 గ్రాములకు 185 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఇందులో విటమిన్-సి కూడా పుష్కలంగా ఉండటం వల్ల, ఈ ఆకులోని కాల్షియంను శరీరం చాలా త్వరగా గ్రహిస్తుంది. దీన్ని పప్పు, కూరలు, సూప్‌లు లేదా పరాటాలలో వేసుకొని తినొచ్చు.
భోజనం తర్వాత ఏదైనా తీపి తినాలనిపించినప్పుడు స్వీట్లకు బదులు ఎండు అంజూర పండ్లు తినడం అలవాటు చేసుకోండి. 100 గ్రాముల ఎండు అంజూరలో 162 మిల్లీగ్రాముల కాల్షియం దొరుకుతుంది. వీటిలోని ఫైబర్, పొటాషియం దీర్ఘకాలంలో ఎముకలు అరిగిపోకుండా కాపాడతాయి.
రుచితో పాటు బలాన్నిచ్చే రాజ్మాలో 100 గ్రాములకు 143 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది అంటే పాల కంటే ఎక్కువే. వీటితో పాటు ప్రొటీన్, మెగ్నీషియం, ఐరన్ కూడా పుష్కలంగా ఉంటాయి. రాజ్మాను సరిగ్గా నానబెట్టి, బాగా ఉడికించి తింటే అందులోని పోషకాలు పూర్తిగా శరీరానికి అందుతాయి.
ఎముకలు ఎల్లప్పుడూ గట్టిగా ఉండాలంటే కేవలం కాల్షియం మాత్రమే సరిపోదు. ఈ ఆహారాలతో పాటు రోజూ కాసేపు ఉదయం ఎండలో నిలబడటం (విటమిన్-డి కోసం), తగినంత ప్రొటీన్ తీసుకోవడం, చిన్నపాటి వ్యాయామం చేయడం అలవాటు చేసుకుంటే వృద్ధాప్యంలోనూ ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి.
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 12 Live: రామేశ్వరం శ్రీ రామనాథ స్వామి కల్యాణం..
-
Calcium-Rich Foods: పాల కంటే 8 రెట్లు ఎక్కువ కాల్షియం.. రోజుకు కొంచెం తిన్నా ఎముకలు ఉక్కులా మారతాయి!
-
IFFI 2026: గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో మెగాస్టార్ సినిమా సందడి.. దేశవ్యాప్తంగా ఆ 5 చిత్రాల్లో ఒకటిగా రికార్డ్!
-
Off The Record: తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మార్పు వెనుక అసలు కథ.. ఢిల్లీ పెద్దల బిగ్ స్కెచ్ ఇదేనా..?
-
Trump Tariffs: ట్రంప్ టారిఫ్ బాంబ్.. భారత్‌పై 25, చైనాకు 40 శాతం..
-
CM Chandrababu: గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు.. రేషన్ షాపుల్లో తక్కువ ధరకే కందిపప్పు, పామాయిల్..
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!