Supreme Court: జంక్ ఫుడ్‌పై సుప్రీం కొరడా.. ప్యాకెట్లపై ఇకపై విడివిడిగా ‘హై ఫ్యాట్, షుగర్, సాల్ట్’ హెచ్చరికలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్యాకేజ్డ్ ఫుడ్ ప్యాకెట్లపై అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు స్థాయిలను సూచించే విధంగా వేర్వేరు చిత్రాలతో కూడిన హెచ్చరిక లేబుళ్లను తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) ను సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది. ఫ్రంట్-ఆఫ్-ప్యాకేజ్ న్యూట్రిషన్ లేబులింగ్ నిబంధనల కింద నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువగా ఉన్న ప్రతి పోషకానికి ఒకే షట్కోణ లేబుల్ కాకుండా, “HIGH FAT”, “HIGH SUGAR” లేదా “HIGH SALT” అనే పదాలతో కూడిన ప్రత్యేక చిత్రాలతో విడివిడిగా హెచ్చరికలు ముద్రించాలని కోర్టు స్పష్టం చేసింది. దీనివల్ల వినియోగదారులు అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను సులభంగా గుర్తించే అవకాశం కలుగుతుంది. అలాగే.. 2020 నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, పాఠశాల పాఠ్యాంశాలు, వర్క్‌షాప్‌ల ద్వారా పిల్లల్లో పోషకాహారంపై అవగాహన పెంచాలని కేంద్రానికి సూచించింది.
గతంలో 2022లో FSSAI హెల్త్-స్టార్ రేటింగ్ విధానాన్ని ప్రతిపాదించినప్పటికీ, అది అమల్లోకి రాలేదు. ఆ తర్వాత ICMR-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ రూపొందించిన 2024 మార్గదర్శకాల ఆధారంగా ఎరుపు రంగు షట్కోణ హెచ్చరికల వైపు మొగ్గు చూపింది. అంతేకాకుండా.. నాన్-కేలోరిక్ స్వీటెనర్లు ఉన్న ఉత్పత్తులపై ప్రత్యేక హెచ్చరికను కూడా ప్రతిపాదించింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ‘క్లీన్-లేబుల్’, ఆరోగ్యకరమైన పదార్థాల పేరుతో మార్కెటింగ్ చేసుకునే డైరెక్ట్-టు-కన్స్యూమర్ ఫుడ్ బ్రాండ్లపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.
Also Read
- Tariff on US Goods: అమెరికా 25 శాతం వేస్తే.. భారత్ కూడా అదే చేయాలి! ప్రధాని మోదీకి వ్యాపారుల లేఖ
- Space X Shares: ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన.. పిల్లలకూ స్పేస్ ఎక్స్ షేర్లు ఇస్తాం..
- 26/11 Mumbai Attacks: ముంబై ఉగ్రదాడుల వెనుక మరో రహస్యం.. 18 ఏళ్లుగా వీడని పాక్ ఆర్మీ అధికారి మిస్టరీ!
- Nvidia: ఎన్విడియాలో మరో సంచలన ప్రేమకథ.. చైనా లింక్ ఉన్న సంస్థ ఎగ్జిక్యూటివ్‌తో సీఈఓ సన్నిహితుడి రహస్య వివాహం..?
ఈ నిబంధనల వల్ల ఆయా కంపెనీలు తమ ఉత్పత్తుల తయారీ విధానాలు, ప్యాకేజింగ్, మార్కెటింగ్ వ్యూహాలను మార్చుకోవాల్సి వస్తుంది. ఇది ముఖ్యంగా చిన్న కంపెనీలకు అదనపు ఖర్చులతో కూడుకున్నది. ఇప్పటికే తప్పుదోవ పట్టించే ప్రకటనల విషయంలో పలు బ్రాండ్లకు FSSAI నోటీసులు జారీ చేసింది. దీనితో పాటు ఈ-కామర్స్, క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, క్లౌడ్ కిచెన్ల విషయంలోనూ తయారీ, గడువు తేదీలు, చిరునామాల వెల్లడి వంటి కఠిన నిబంధనలను తీసుకురావాలని నియంత్రణ సంస్థ యోచిస్తోంది.
తాజావార్తలు
-
Supreme Court: జంక్ ఫుడ్‌పై సుప్రీం కొరడా.. ప్యాకెట్లపై ఇకపై విడివిడిగా ‘హై ఫ్యాట్, షుగర్, సాల్ట్’ హెచ్చరికలు..
-
Tollywood: ఇంటర్వెల్ వరకు కాలర్ ఎగరేస్తే.. క్లైమాక్స్‌కు తల పట్టుకుంటున్నారు!
-
Tariff on US Goods: అమెరికా 25 శాతం వేస్తే.. భారత్ కూడా అదే చేయాలి! ప్రధాని మోదీకి వ్యాపారుల లేఖ
-
Space X Shares: ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన.. పిల్లలకూ స్పేస్ ఎక్స్ షేర్లు ఇస్తాం..
-
26/11 Mumbai Attacks: ముంబై ఉగ్రదాడుల వెనుక మరో రహస్యం.. 18 ఏళ్లుగా వీడని పాక్ ఆర్మీ అధికారి మిస్టరీ!
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!