Kishan Reddy: కేబినెట్ భేటీకి వెళ్లకుండా.. అమిత్ షాను ఒప్పించి, మోడీ అనుమతితో యాత్ర కొనసాగిస్తున్నా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: ‘నషా ముక్త్ భారత్’ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. యాత్రలో భాగంగా ఆయన ప్రసంగిస్తూ, అన్ని వర్గాల ప్రజలు, పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు, సినీ ప్రముఖులు స్వచ్ఛందంగా తరలిరావడం తనకు ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. డ్రగ్స్ సమస్యను కేవలం దేశ సమస్యగా కాకుండా, ప్రతి ఒక్కరూ తమ సొంత సమస్యగా భావిస్తున్నారని, ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్ నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ఈ స్పందన చూస్తుంటే ‘నషా ముక్త్ భారత్’ లక్ష్యాన్ని తప్పకుండా సాధిస్తామనే నమ్మకం కలుగుతోందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
సామాజిక సమస్యలపై చర్చించుకునే కుటుంబాలు ఇప్పుడు డ్రగ్స్ అంశంపై కూడా మాట్లాడుకుంటున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రాత్రి రెండు గంటల వరకు అనేక మంది వచ్చి తమను కలిశారని, నగర శివారుల నుంచి ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు, సిబ్బంది తరలివచ్చి సంఘీభావం తెలుపుతూ ఉత్సాహంగా ప్రతిజ్ఞ చేస్తున్నారని వివరించారు. దేశంలో డ్రగ్స్‌కు బానిసలవుతున్న వారిలో 13 శాతం మంది 14 నుంచి 16 ఏళ్ల మధ్య వయసు వారే ఉన్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ, అందుకే తాను పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని అవగాహన కల్పిస్తున్నానని చెప్పారు. పాఠశాలల విజ్ఞప్తి మేరకు పాఠ్యాంశాల్లో (సిలబస్) డ్రగ్స్ దుష్ప్రభావాలపై అంశాలను చేర్చే విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
Also Read
- IND vs NZ: 110 పరుగులకే 4 వికెట్లు.. అయినా భారత్‌కు చిక్కని కివీస్..!
- Hanuman Ansh OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన 'హనుమాన్ అంశ్'.. తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- 999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్‌బైక్ భారత్ లో లాంచ్.!
- Vedant Sehwag: పెద్దోడు డేంజర్.. చిన్నోడు మహా డేంజర్.. 7 వికెట్లతో చెలరేగిన సెహ్వాగ్ చిన్న కుమారుడు..
రాబోయే రోజుల్లో భారత యువత కీలక పాత్ర పోషిస్తుందని, వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో డీ-అడిక్షన్ కేంద్రాలను పెంచాల్సిన అవసరం ఉందని, భవిష్యత్తులో వాటి సంఖ్యను పెంచుతామని తెలిపారు. సరిహద్దు దేశాల నుంచి వివిధ మార్గాల ద్వారా డ్రగ్స్ దేశంలోకి వస్తున్నాయని, దీనిని అరికట్టేందుకు ఇప్పటికే పలు దేశాలతో ఒప్పందాలు చేసుకున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 1 లక్షా 89 వేల కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసిందని వెల్లడించారు. డ్రగ్స్ బారిన పడిన వారిని సమాజం నుంచి వెలివేయకుండా, వారితో స్నేహపూర్వకంగా ఉంటూ ఆ మహమ్మారి నుంచి బయటపడేలా చేయాలని సూచించారు.
ఈ రోజు మైత్రివనం వద్ద సినీ నటుడు అక్కినేని నాగార్జున యాత్రలో పాల్గొంటారని, మధ్యాహ్నం 3 గంటలకు యాత్ర ఫిల్మ్ నగర్ చేరుకుంటుందని కిషన్ రెడ్డి తెలిపారు. ముగింపు సభలో ప్రముఖ నటుడు చిరంజీవి, ఆధ్యాత్మిక గురువు పండిట్ రవిశంకర్ పాల్గొంటారని వెల్లడించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కేంద్ర కేబినెట్ సమావేశం ఉన్నందున, యాత్రను రద్దు చేసుకుని రావాలని ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఫోన్ చేశారని చెప్పారు. అయితే, ఈ కార్యక్రమానికి వస్తున్న స్పందనను అమిత్ షాకు వివరించి ఒప్పించానని, ఆయన ద్వారా ప్రధాని మోడీ అనుమతి తీసుకున్నానని తెలిపారు. ఏ మంత్రికి మినహాయింపు ఇవ్వకపోయినా, ‘నషా ముక్త్ భారత్’ కార్యక్రమ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని తనకు అనుమతి ఇచ్చినందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ యాత్రలో ఎక్కడా బీజేపీ జెండా లేదని స్పష్టం చేస్తూ, సమస్యపై అవగాహన లేకుండా విమర్శలు చేసే వారికి తాను సమాధానం చెప్పనని, వారికి తెలివి ఉంటే ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని హితవు పలికారు.
తాజావార్తలు
-
IND vs NZ: 110 పరుగులకే 4 వికెట్లు.. అయినా భారత్‌కు చిక్కని కివీస్..!
-
Kishan Reddy: కేబినెట్ భేటీకి వెళ్లకుండా.. అమిత్ షాను ఒప్పించి, మోడీ అనుమతితో యాత్ర కొనసాగిస్తున్నా..
-
Hanuman Ansh OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన ‘హనుమాన్ అంశ్’.. తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్‌బైక్ భారత్ లో లాంచ్.!
-
Yashasvi Jaiswal History: యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు!
ట్రెండింగ్
-
Viral Video: ఏంటి స్వామి ఈ పని..? రైలులో ఏదైనా జరగరానిది జరిగితే ఎలా..
-
25 రోజుల బ్యాటరీ బ్యాకప్, 100+ స్పోర్ట్స్ మోడ్స్ తో Vivo WATCH GT 2 స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Sineth Jayawardena: కోచ్ మాటలతో టీమిండియాపై చెలరేగిపోయా.. శ్రీలంక సెంచరీ హీరో సంచలన వ్యాఖ్యలు!
-
BSNL సంచలనం.. రూ.51కే 56GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్..!
-
IND vs NZ 2nd Test: అరంగేట్రంలోనే వికెట్ తీసిన గుర్నూర్.. లాథమ్ హాఫ్ సెంచరీతో దూకుడుగా..!