మెంతులు లేని వంట గది ఉండదు.ఇవి ఆరోగ్యానికి అన్ని రకాలుగా మేలు చేస్తాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్,ఇతర ఔషధ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి, అందుకే ఈ మెంతులు సంప్రదాయ వైద్యం, ఆయుర్వేదంలో ఎంతో ప్రసిద్ధి చెందాయి. మెంతులు పీచు, ఖనిజాలు, ఇతర పోషకాలు కలిగి ఉంటాయి. ఒక టేబుల్ స్పూన్ మెంతులు రోజువారీ విలువలో మినిమమ్ 20 శాతం ఇనుము, 7 శాతం మాంగనీస్, 5 శాతం మెగ్నీషియంను అందిస్తాయి. ఇక ఆరోగ్యపరంగా మెంతులు మంచివే కానీ అవి ఎక్కువ మొత్తంలో తీసుకుంటే కడుపుకు ఇబ్బంది కలిగిస్తాయి. ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్లు మెంతుల వినియోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వైద్యుల సలహా మేరకు మెంతులు తీసుకోవాలి పేర్కొంటున్నారు. మరిక మెంతుల గురించి మరిన్ని విశేషాలు.. అలాగే ఈ వాటిని ఎలా తీసుకోవాలి అనేది చూద్దాం.
– మధుమేహం.. ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ సమస్య బారిన పడుతున్నారు. ఇక మధమేహం తో బాధపడుతున్న వారు మెంతులు నానబెట్టి తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తాయి. వీటిలో అధిక పీచు ఉండటంతో, జీర్ణ క్రియలు సజావుగా కొనసాగుతాయి. కడుపు ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్ సమస్యలు తగ్గించడంలో మెంతులు సహాయపడతాయి. అందుకే ప్రతి రోజూ ఉదయం వీటిని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల మధుమేహంతో తగ్గించడంతో పాటు మరిన్ని ప్రయోజనాలు కూడా పొందొచ్చు.అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. దీంతో మధుమేహం వ్యాధికి చెక్ పెట్టవచ్చు.
– అంతేకాదు బరువు తగ్గడానికి కూడా మెంతులు బాగా పనిచేస్తాయి. ఆకలిని తగ్గించి తద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతాయి. కనుక అధిక బరువుతో బాధపడుతున్న వారు ఈ మెంతుల నీళ్లు తాగితే మంచి రిజల్ట్ చూస్తారు.
– మెంతులు చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి జుట్టు చుండ్రు, స్కాల్ప్ ఇన్ఫెక్షన్ చికాకును తగ్గించడంలో సహాయ పడతాయి. ఇక మెంతి గింజలు శరీరంలోని బ్యాక్టీరియా, ఫ్రీ రాడికల్స్‌కు వ్యతిరేకంగా సమర్థవంతమైన రక్షణను అందిస్తాయి. ఇందులో డయోస్జెనిన్ అనే సమ్మేళనం ఉంటుంది, ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది మొటిమల సమస్యతో బాధపడుతున్న వారికి బాగా సహాయపడుతుంది.ముడతలు పడిన చర్మం, నల్ల మచ్చలు, ఇన్ఫెక్షన్లను నివారించడానికి సహాయపడుతుంది.
– పాలిచ్చే తల్లులలో పాల ఉత్పత్తిని పెంచడానికి మెంతులు ఉపయోగపడతాయి. ఈ మధ్యకాలంలో చాలా మంది తల్లులు పాలు పడక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీటికోసం మందులు కూడా వాడుతున్నారు. సరైన పోషకాలు తీసుకుంటే పాల ఉత్పత్తి బాగుంటుంది. కనుక మెంతు గింజలను నీటిలో మరిగించి టీలా తయారు చేసుకోవచ్చు. లేదా మెంతుల గింజలను కూరగాయలు, పప్పు, రొట్టెలలో వేసి తినవచ్చు. అలాగే పొడి చేసి, చట్నీ లేదా ఇతర వంటలలో వాడవచ్చు. ఇది స్త్రీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఈ సమాచారం మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు నుండే మొదలు పెట్టండి.