Betel Leaf Benefits: తమలపాకు.. నిత్యం ఏదో ఒక సందర్భంలో ఈ ఆకును మనమందరం ఉపయోగిస్తునే ఉంటాం. శుభకార్యాలు, పూజలు, కిల్లీ వంటి కోసం ఈ ఆకులను విరివిరిగా వాడుతుంటారు. దీంతో తమలపాకును ఆకే కదా అని తీసి పారేయకండని అంటున్నారు పలువురు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. ఎందుకని ఆలోచిస్తున్నారా.. మీకు తెలుసా.. తమలపాకులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని.. ఈ ఆకు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, జీర్ణ లక్షణాలను కలిగి ఉందని ఆయుర్వేద ఆరోగ్య నిపుణలు చెబుతున్నారు. దీనిని తినడం ద్వారా ఎవరికి ఉపయోగం ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Tollywood : ఒక్క ఫ్లాప్‌తో మనసు మార్చుకుంటున్న హీరో, దర్శకనిర్మాతలు
వీరికి దివ్యౌషధం..
తమలపాకులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పరిశోధన ప్రకారం.. వీటిని తీసుకోవడం వల్ల మధుమేహ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే గ్యాస్, మలబద్ధకంతో బాధపడేవారికి తమలపాకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయని చెబుతున్నారు. ఈ ఆకులు తీసుకోవడంతో జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుందని, దీంతో కడుపులో అసౌకర్యం తగ్గుతుందని పేర్కొన్నారు. ఆర్థరైటిస్ లేదా కీళ్ల నొప్పులతో బాధపడేవారికి, తమలపాకు వరం లాంటిదని తెలిపారు. దీనిలోని ఔషధ గుణాలు మంట, నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయని వెల్లడించారు. చర్మపు దద్దుర్లు లేదా ఇన్ఫెక్షన్లు ఉన్నవారికి తమలపాకు ప్రయోజనకరంగా పని చేస్తాయని, ఇవి చర్మపు మంట, దురదను తగ్గిస్తాయని చెప్పారు.
తరచుగా దగ్గు, జలుబు లేదా శ్వాస ఆడకపోవుటతో బాధపడేవారికి తమలపాకు మంచి నివారణ కలిగిస్తుందని పేర్కొన్నారు. తమలపాకులను తినడం వల్ల శరీరంలో శక్తి పెరుగుతుందని, అలసట, బలహీనతను తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. ఈ ఆకులు తినడం వల్ల శరీరం చురుకుదనాన్ని కలిగి ఉంటుందని అన్నారు. తమలపాకులో ఉన్న యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కారణంగా నోటి దుర్వాసన తొలగిపోతుందని, దంతాలు, చిగుళ్లు బలపడతాయని చెప్పారు.
READ ALSO: Gold Prices In India: పసిడి పరుగులను ఆప తరమా? రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధర