మారిన వాతావరణం, ఆహారపు అలవాట్ల కారణంగా మనుషులు అనేక రకాల కొత్త వ్యాధుల బారిన పడుతున్నారు.. అందుకే ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపిస్తున్నారు.. పాలతో చేసిన టీతో పాటు హెర్బల్ టీని కూడా తాగడం మంచిది.. చాలా మందికి ఉదయం లేవగానే ఒక కప్పు టీ తాగితే రోజంతా హుషారుగా ఉత్సాహంగా ఉంటారు. అయితే హెర్బల్ టీని కూడా తాగడం వల్ల ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు అని నిపుణులు చెబుతున్నారు..
ఈరోజుల్లో ఉభకాయం, అధిక బరువు, కీళ్ల నొప్పులు, నిద్రలేమి వంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ఈ టీ తయారు చేసుకుని తాగండి.. ఈ టీ కోసం ముందుగా అంగుళం దాల్చిన చెక్క ముక్క, మూడు యాలకులు, కొన్ని మిరియాలు వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి.. ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో స్టోర్ చేసుకోవాలి..
అలాగే ఒక గ్లాస్ నీటి స్టవ్ మీద పెట్టి శొంఠి, అశ్వగంధ పొడి మరిగించాలి.. ఆ తర్వాత ఆ నీటిని వడగట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఈ డ్రింక్ ను రాత్రి పడుకోవడానికి గంట ముందు ఈ టీ ని తాగితే జీర్ణ ప్రక్రియ బాగా జరిగి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది.. అధిక బరువు ఉన్నవాళ్లకు మంచిది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.. నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది.జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి.. ఇంకా ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.