యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివతో జనతా గ్యారేజ్ తర్వాత చేస్తున్న సినిమా ‘దేవర’. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ పాన్ ఇండియా సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవలే కంప్లీట్ అయ్యింది. దాదాపు 15 రోజులు పాటు జరిగిన యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ కంప్లీట్ అవ్వడంతో ఎన్టీఆర్, నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యే లోపు దుబాయ్ ట్రిప్ వెళ్లాడు. ఈ సందర్భంగా శంషాబాద్ లో కనిపించిన ఎన్టీఆర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ తిరిగి రాగానే కొరటాల శివ కొత్త షెడ్యూల్ మొదలుపెట్టనున్నాడు. మార్చ్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయిన దేవర సినిమా ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసుకుంది. ప్రీప్రొడక్షన్ సమయంలో మాత్రం దేవర సినిమా చాలా డిలే అవుతుందని ఎన్టీఆర్ ఫాన్స్ కంగారు పడ్డారు.
అది డిలే కాదు ప్రిపరేషన్ అని నిరూపిస్తుంది ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ స్పీడ్. ఒక సముద్రం బ్యాక్ డ్రాప్ లో… ఒరిజినల్ అండ్ గ్రాఫిక్స్ వర్క్ కలిపి చేస్తున్న విజువల్స్ ని షూట్ చేస్తూ ఈ స్పీడ్ లో షూటింగ్ జరగడం గొప్ప విషయమే. ప్రీప్రొడక్షన్ స్టేజ్ లో ఎంతో కేర్ తీసుకోని, ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే తప్ప ఇంత క్లారిటీతో షూట్ చెయ్యలేరు. ఆచార్య సినిమాతో ఆడియన్స్ ని డిజప్పాయింట్ చేసిన కొరటాల శివ, ఈసారి దేవర సినిమాతో పాన్ ఇండియా మొత్తం తన పేరు రీసౌండ్ లా వినిపించేలా చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. మరి జస్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన కొరటాల శివ, ఈ మూవీ టీజర్ తో ఇంకెలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి. నవంబర్ కి షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసి, ఆ తర్వాత నుంచి దేవర ప్రమోషన్స్ ని మొదలుపెట్టే అవకాశం ఉంది.