మన జీవితంలో ఎన్నో కలలు కంటాం. సమాజానికి సేవ చేయాలని, మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తాం. అయితే మనం అనుకున్నవి సాధించేవరకూ నిద్రపోకుండా పరిశ్రమించే వారుంటారు. ఆకోవకే చెందిన యువతి ఐశ్వర్య పాతపాటి. పేదలకు సేవ చేయాలని తపించి డాక్టరైన ఐశ్వర్య… తాజాగా మన దేశం తరఫున ‘టాప్ మోడల్ ఆఫ్ ది వరల్డ్ ఇండియా-2023’ పోటీల్లో విజేతగా నిలిచి తెలుగువారి గౌరవాన్ని దశదిశలా చాటింది. త్వరలో ప్రపంచ వేదికపై మెరవనున్న ఐశ్వర్య తన మనసులోని భావాల్ని బయటపెట్టింది.
Read Also: Taraka Ratna: ఒక మంచి మిత్రుడిని కోల్పోయాను-తరుణ్
ఐశ్యర్య క్షత్రియ కుటుంబానికి చెందిన యువతి. అమ్మ అపర్ణ గృహిణి. నాన్న అప్పలరాజు వ్యాపారి. చెల్లి అనిమిష. స్కూల్లో లెక్కలంటే ప్రాణం ఆమెకి. టాప్ మార్కులు ఆమెకి వచ్చేవి. ఐశ్వర్య అమ్మమ్మకు డయాబెటిస్ ఉండేది. ఆమెకు మాత్రలు తనే ఇచ్చేది. మనవరాలిని ఆమె డాక్టర్ అని పిలిచేది. ‘నువ్వు పెద్దయ్యాక డాక్టరై, పేదవాళ్లకు వైద్యం చేయాలి’ అని అమ్మమ్మ కోరుకునేది. అదే ఆమె డాక్టర్ అయ్యేందుకు దోహదపడింది. వైద్యవృత్తిపై ఆసక్తి పెరిగింది. డాక్టర్ కోరికతోనే ఇంటర్‌లో బైపీసీలో చేరాలనుకున్నప్పుడు నాన్న అభ్యంతరం చెబితే వాళ్ళ అమ్మ ఒప్పించింది. అలా ఎంబీబీఎస్ అయ్యాక న్యూట్రిషన్, డెర్మటాలజీ కోర్సులు పూర్తి చేసింది ఐశ్వర్య.
ప్రస్తుతం జనరల్ సర్జన్‌గా ఎమ్మెన్నార్ మెడికల్ కాలేజీలో విధులు నిర్వహిస్తుంది. ఆడపిల్లలకు మంచి చదువుతో పాటు అందం, ఆరోగ్యం అవసరం. అవి ఆత్మవిశ్వాసాన్ని అందిస్తాయని ఐశ్వర్య ప్రగాఢంగా విశ్వసిస్తోంది. ఐశ్వర్యకు అందంపై ఆసక్తి ఎక్కువ. పెద్దైన తర్వాత అందాల పోటీల్లో పాల్గొనాలనుకునేది. ఎంబీబీఎస్ తర్వాత ఇన్‌స్టాలో పొడవు జుట్టుతో నా ఫొటోలు చూసి ఒక యాడ్ ఏజెన్సీ మోడలింగ్ చేయమని అడిగింది. పేరెంట్స్ కి చెప్పకుండా ఆమె మోడలింగ్ చేసింది. మిస్ ఇండియా ఫెమినా పోటీలకూ వెళ్ళినా అక్కడ సక్సెస్ కాలేకపోయింది. తర్వాత శిక్షణ తీసుకొని.. గత డిసెంబరులో ‘టాప్ మోడల్ ఆఫ్ ది వరల్డ్ ఇండియా – 2023’ పోటీలకు అప్లై చేశా. వివిధ రాష్ట్రాలకు చెందిన 30 మందిని ఎంపిక చేశారు. తుది జాబితాలో 12 మంది ఉన్నాం. జనవరిలో ఢిల్లీలో పలుదశల తర్వాత విజేతగా నన్ను ప్రకటించారు. త్వరలో ఈజిప్టులో జరగనున్న ‘టాప్ మోడల్ ఆఫ్ ది వరల్డ్’ పోటీకి మన దేశం తరఫున హాజరవుతున్నా అంటోంది. ఐశ్యర్య పాతపాటికి ఆల్ ది బెస్ట్ చెబుదాం.
Read Also: NTR 30: తారకరత్న అకాలమరణం కారణంగా ఎన్టీఆర్ 30 వాయిదా…