న్యూయార్క్ మేయర్‌గా జోహ్రాన్ మమ్దానీ ప్రమాణస్వీకారం చేశారు. న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ ప్రమాణ స్వీకారం చేయించారు. అమెరికా చరిత్రలో తొలిసారిగా ఖురాన్‌పై చేయి వేసి ప్రమాణం చేయడం ఇదే తొలిసారి. న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్‌లోని సబ్‌వే స్టేషన్‌లో జరిగిన చారిత్రాత్మక కార్యక్రమంలో మమ్దానీ ప్రమాణ స్వీకారం చేశారు. ‘‘ఇది నిజంగా జీవితకాల గౌరవం, ప్రత్యేకత’’ అని మమ్దానీ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Gold Rates: న్యూఇయర్ వేళ బంగారం, సిల్వర్ ధరలు ఇలా!
భారత సంతతికి చెందిన 34 ఏళ్ల మమ్దానీ డెమొక్రాట్ పార్టీ నుంచి న్యూయార్క్ మేయర్‌గా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందాడు. అమెరికా చరిత్రలో ఒక ముస్లిం వ్యక్తి అతిపెద్ద నగరమైన న్యూయార్క్‌కు మేయర్‌గా ఎన్నిక కావడం ఇదే తొలిసారి. ఈ పదవిని చేపట్టిన తొలి దక్షిణాసియా వ్యక్తిగా.. తొలి ఆఫ్రికన్ సంతతి వ్యక్తి ఇతడే కావడం విశేషం.

వాస్తవానికి మమ్దానీ పూర్వీకులంతా ఎక్కువ మంది బైబిల్ మీదే ప్రమాణం చేశారు. వాస్తవానికి రాజ్యాంగ బద్ధమైన ప్రమాణానికి ఏ మతపరమైన గ్రంథాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదు. కానీ మమ్దానీ భార్య రమా దువాజీ సూచన మేరకు ఖురాన్‌పై ప్రమాణం చేశారు. రెండు ఖురాన్‌లపై చేతిని ఉంచి ప్రమాణం చేశారు. ఒకటి మమ్దానీ తాతకు చెందిన ఖురాన్ కాగా.. ఇంకొకటి 18వ శతాబ్దం చివరి నాటి పాకెట్ సైజ్ వెర్షన్ కలిగిన ఖురాన్‌పై చేయి ఉంచి ప్రమాణం చేశారు.
VIDEO | New York, US: Zohran Mamdani (@ZohranKMamdani) is sworn in as the Mayor of New York during a private midnight ceremony at the Old City Hall Station.#NewYorkMayor #ZohranMamdani #USPolitics
(Source – AFP/PTI)
(Full video available on PTI Videos -… pic.twitter.com/dOroCVCVBr
— Press Trust of India (@PTI_News) January 1, 2026