US Recession : ప్రపంచ ఆర్థిక పరిస్థితి మరోసారి సవాలుగా మారుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు పయనిస్తోందా? లేదా ఆర్థిక వ్యవస్థ కేవలం గడ్డు స్థానానికి చేరుతోందా?
Layoff problems: ఆర్థికమాంద్యం భయాల వల్ల చాలా కంపెనీలు తమ ఉద్యోగుల్ని తీసేశాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీలు వేలల్లో ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఉద్యోగాలు కోల్పోయిన వారు మానసికంగా చాలా వేదన అనుభవిస్తున్నారు. కొందరు ఎన్ని ఉద్యోగాలకు అఫ్లై చేసిన ఉద్యోగం దొరకని పరిస్థితి ఏర్పడింది. స్విగ్గీ నుంచి తొలగించబడిన ఉద్యోగి ప్రతీ రోజు 100 కన్నా ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నానని.. అయితే తనకు ఇప్పటి వరకు ఎలాంటి ఉద్యోగం రాలేదని వెల్లడించారు.
Uber Layoff: ఆర్థికమాంద్యం భయాలు, ఖర్చులను తగ్గించుకునేందుకు అన్ని టెక్ కంపెనీలు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు ప్రపంచ దిగ్గజ కంపెనీలు మెటా, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి కంపెనీలు వేలల్లో తమ ఉద్యోగుల్ని తీసేశాయి. ఇతర కంపెనీలు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. ఆదాయం తగ్గడంతో ఖర్చులను తగ్గించుకునే వ్యూహంలో భాగంగా పలు కంపెనీలు ఉద్యోగుల్ని దశలవారీగా తొలగించుకుంటూ వస్తున్నాయి.
Oracle: ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ప్రపంచదిగ్గజ కంపెనీలు వేలల్లో ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించాయి. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ప్రముఖ సంస్థలు తమ ఉద్యోగులను తొలగించాయి
న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా పతనమైంది. మొదటి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ కుంచించుకుపోవడంతో న్యూజిలాండ్ మాంద్యంలోకి జారిపోయింది. గురువారం విడుదల చేసిన డేటా ప్రకారం.. న్యూజిలాండ్ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారిపోయింది.
Technical Recession: ప్రపంచం అంతా ఆర్థికమాంద్యంతో భయపడుతోంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం, కరోనా మహమ్మారి, పెరుగుతున్న వడ్డీరేట్లు, ద్రవ్యోల్భణ పరిస్థితులు ప్రపంచాన్ని మాంద్యం దిశగా వెళ్లేలా చేస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాలు నెగిటివ్ వృద్ధిరేటును నమోదు చేస్తున్నాయి.
జర్మనీ ఆర్థిక వ్యవస్థ గత మూడు నెలలతో పోలిస్తే 2023 మొదటి త్రైమాసికంలో కొద్దిగా కుంచించుకుపోయింది, తద్వారా సాంకేతిక మాంద్యంలోకి ప్రవేశిస్తున్నట్లు డేటా గురువారం చూపించింది. ఒక ప్రాథమిక అంచనా ప్రకారం మొదటి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (GPD) సున్నా వృద్ధితో నిలిచిపోయింది.
Recession: ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఆర్థికవేత్తలు ఈ ఏడాది ఆర్థికమాంద్యం తప్పదని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అమెరికాతో పాటు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి యూరోపియన్ దేశాలు కూడా ఆర్థికమాంద్యాన్ని ఏదుర్కొవాల్సిందే అని చెబుతున్నారు. ఇప్పటికే అమెరికా ఫెడరల్ బ్యాంక్ ద్రవ్యోల్భణం, ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొనేందుకు వడ్డీరేట్లను పెంచుతోంది. ఇక బ్రిటన్ వ్యాప్తంగా నిత్యావసరాల ధరలు చుక్కల్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ట్రెజరీ మాంద్యం గురించి హెచ్చరించింది.
Salary Hike Time: కొత్త సంవత్సరం వచ్చి మూడు నెలలవుతోంది. కొత్త ఆర్థిక సంవత్సరం మరికొద్ది రోజుల్లో రాబోతోంది. ఈ సమయంలో ఉద్యోగులు తమ వేతనాలు ఏ మేరకు పెరుగుతాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఏప్రిల్ నుంచి కొత్త బడ్జెట్ అమల్లోకి రానుండటంతో కొన్ని ధరలు పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు శాలరీ హైక్ ఆశిస్తారు. పర్సనల్ ఫైనాన్సియల్ ప్లానింగ్ వేసుకుంటారు.