All Eyes On Rafah: అప్పుడు మీ అందరి కళ్లు ఎక్కడున్నాయి.. ‘‘ఆల్ ఐస్ ఆన్ రఫా’’పై ఇజ్రాయిల్ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
All Eyes On Rafah: ఇజ్రాయిల్-గాజా మధ్య యుద్ధ తీవ్రత మరింత పెరిగింది. ఇటీవల దక్షిణ గాజాలోని రఫా నగరంలో ఇజ్రాయిల్ జరిపిన దాడిలో శరణార్థి శిబిరంలోని చిన్నారులతో పాటు కనీసం 45 మంది మరణించారు. ఈ దృశ్యాలు ప్రపంచాన్ని కదిలించాయి. దీంతో ప్రపంచంలోని ప్రముఖులు, క్రీడాకారులు మిలియన్ల సంఖ్యలో సోషల్ మీడియాలో ‘ఆల్ ఐస్ ఆన్ రఫా’’ అనే హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేశారు. ఈ దాడి ఘటన అంతర్జాతీయంగా ఇజ్రాయిల్‌ని మరింత ఒంటరి చేసే ప్రయత్నం చేసింది. అమెరికా కూడా ఈ దాడి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
అయితే, దీనికి ప్రతిస్పందనగా ఇజ్రాయిల్ కూడా అంతే ధీటుగా స్పందించింది. రఫాపై కన్నీరు కారుస్తున్న వారంతా ఇజ్రాయిల్‌పై హమాస్ మిలిటెంట్లు దాడి చేసి, అభంశుభం తెలియని చిన్నారులను చంపినప్పుడు ఎక్కడున్నారంటూ ప్రశ్నించింది. దీనికి సంబంధించి ఓ సోషల్ మీడియా పోస్టుని ఇజ్రాయిల్ పంచుకుంది. గన్ పట్టుకున్న హమాస్ ఉగ్రవాది ముందు ఓ చిన్న పిల్లాడు ఉన్న ఫోటోని ట్వీట్ చేసింది. అక్టోబర్ 7 దాడిలో హమాస్ ఉగ్రవాదులు చేతిలో 1200 మంది మరణించడంతో పాటు 240 మందిని బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లారు. ప్రస్తుతం ఉగ్రవాదుల చేలితో 99 మంది బందీలు సజీవంగా ఉన్నారని, 31 మంది మరణించారని ఇజ్రాయిల్ భావిస్తోంది.
Also Read
- Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
- Trump Marine One: ట్రంప్‌కు గగనతలంలో ప్రమాదం?.. ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’కు దగ్గరగా వచ్చిన ప్యాసింజర్ విమానం
- Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
- Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
Read Also: PM Modi: 45 గంటల పాటు ధ్యానం చేసేందుకు సిద్దమవుతున్న ప్రధాని మోడీ.. వివరాలు ఇలా..
హమాస్ దాడి తర్వాత ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్‌పై విరుచుకుపడుతోంది. అయితే, ఉత్తరాన ఉన్న గాజా నగరాన్ని జల్లెడ పట్టినప్పటికీ అక్కడ ఇజ్రాయిల్ బందీలు లేకపోవడంతో, హమాస్‌కి మరో స్థావరంగా ఉన్న దక్షిణాన ఉన్న రఫాని టార్గెట్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన దాడిలో 45 మంది మరణించారు.
ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఎక్స్ వేదికగా, రఫాపై పోస్టు పెడుతున్న వారిని ఉద్దేశించి ట్వీట్ చేశారు. ‘‘ అక్టోబర్ 7న మీ కళ్లు ఎక్కడ ఉన్నాయి. మేమే అక్టోబర్ 7 గురించి మాట్లాడటం ఆపము, మేము బందీల కోసం పోరాటాన్ని ఎప్పటికీ ఆపము’’ అని ఆయన స్పష్టం చేశారు. దాదాపుగా 45 మిలియన్ల మంది యూజర్లు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ‘‘ ఆల్ ఐస్ ఆన్ రఫా’’ వైరల్ చేశారు. “ఆల్ ఐస్ ఆన్ రఫా” చిత్రాన్ని పోస్ట్ చేసిన భారతీయ ప్రముఖుల్లో కొందరు ప్రియాంక చోప్రా జోనాస్, అలియా భట్, కరీనా కపూర్ ఖాన్, మాధురీ దీక్షిత్ నేనే, వరుణ్ ధావన్ మరియు సమంతా రూత్ ప్రభు ఉన్నారు.
We will NEVER stop talking about October 7th.
We will NEVER stop fighting for the hostages. pic.twitter.com/XoFqAf1IjM
— Israel ישראל (@Israel) May 29, 2024
తాజావార్తలు
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్‌గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
-
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్‌ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!