Pakistan: పాకిస్తాన్ వ్యాప్తంగా వేర్పాటువాద ఉద్యమాలు ఎగిసిపడుతున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ లోని అతిపెద్ద ప్రావిన్సు, అత్యధిక ఖనిజవనరులు కలిగిన బలూచిస్తాన్ సొంతదేశం కోసం పోరాటం చేస్తోంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) ఇటీవల బలూచిస్తాన్‌ని స్వతంత్య్ర దేశంగా ప్రకటించుకుంది. తమను ప్రత్యేక దేశంగా గుర్తించాలంటూ ఐక్యరాజ్యసమితిని కూడా ఆశ్రయించింది. మరోవైపు, బీఎల్ఏ యోధులు పాక్ ఆర్మీకి చుక్కలు చూపిస్తున్నారు. పాక్ ఆర్మీ కనిపిస్తే దాడులు చేస్తున్నారు. ఆపరేషన్ హరోప్‌తో పాక్ సైన్యాన్ని వేటాడుతున్నారు. నిజంగా చెప్పాలంటే, క్వెట్టా, పంజ్‌గుర్,…