రష్యా-ఉక్రెయిన్ మధ్య గత నాలుగేళ్ల నుంచి భీకరయుద్ధం సాగుతోంది. 2022లో రష్యా.. ఉక్రెయిన్‌పై దండయాత్ర మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఏకధాటిగా ఇరు పక్షాల నుంచి దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. యుద్ధం ఆపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒక అడుగు ముందుకేసి చర్చలకు వచ్చారు. కానీ రష్యా మాత్రం వెనుకడుగు వేస్తోంది. దీంతో మధ్యవర్తిత్వం చేస్తున్న అమెరికాకు ఒకింత అసహనం వచ్చేసింది. అయితే తాజాగా మరోసారి ఇస్తాంబుల్ వేదికగా కాల్పుల విరమణపై చర్చలు జరగనున్నాయి. ఇలాంటి తరుణంలో ఉక్రెయిన్ డ్రోన్లతో రష్యాపై విరుచుకుపడింది. వైమానిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేయడంతో రష్యన్ విమానాలు మంటలకు ఖాళీ పోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఆపరేషన్ కు ఆపరేషన్ సిందూర్ మాదిరిగా.. స్పైడర్ వెబ్‌గా ఉక్రెయిన్ నామకరణం చేసింది.
Ukrainian President Volodymyr Zelenskyy = King of Drones
Who "doesn't have any cards" now? pic.twitter.com/yYZ4tsIvMZ
— Business Ukraine mag (@Biz_Ukraine_Mag) June 1, 2025
మార్చిలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అమెరికాలో పర్యటించారు. వైట్‌వైస్‌లో అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో జెలెన్‌స్కీ వాగ్వాదానికి దిగారు. తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం జరగడంతో మధ్యలోనే వైట్‌హౌస్‌ను జెలెన్‌స్కీ విడిచిపెట్టారు. ఇక జెలెన్‌స్కీ తెగింపుపై సోషల్ మీడియాలో హీరోగా ప్రొజెక్ట్ అయ్యారు. తాజాగా మరోసారి జెలెన్‌స్కీ తెగింపు ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేసింది. ఆదివారం రష్యాపై ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడులతో వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి. దీంతో ప్రపంచం ఉలిక్కిపాటుకు గురైంది.
ఇది కూడా చదవండి: Dhanush : మీరు ఎన్ని కుట్రలు చేసిన నేను భయపడను..
రష్యన్ వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ ఆకస్మిక డ్రోన్ దాడులు జరగగానే.. కొద్దిసేపటికే ఉక్రెయిన్ బిజినెస్ మ్యాగజైన్‌లో పోస్టు వచ్చింది. ‘‘జెలెన్‌స్కీ డ్రోన్ల రాజు అంటూ పేర్కొంది. ఇప్పుడు ఎవరి దగ్గర కార్డులు లేవు’’ అంటూ పేర్కొంది. జెలెన్‌స్కీని కార్డుపై రాజుగా చిత్రీకరించింది. జెలెన్‌స్కీ కత్తులు పట్టుకుని కనిపించారు. ఇక కార్డుపై డ్రోన్లు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Sri Sathya Sai: తన భూమి కబ్జా చేశారని జవాన్ సెల్ఫీ వీడియో.. కబ్జాదారుల నుంచి తన భూమిని కాపాడాలంటూ..
మార్చిలో వాషింగ్టన్‌లోని ఓవల్ ఆఫీసులో జెలెన్‌స్కీతో ట్రంప్ ఇలా వ్యాఖ్యానించారు. ‘‘మీ దగ్గర కార్డులు లేవు. మేము లేకుండా మీకు ఎటువంటి కార్డులు లేవు’’ అని అన్నారు. కరెక్ట్‌గా రెండు నెలల తర్వాత కైవ్ డ్రోన్ దాడి చేసింది. శక్తివంతమైన రష్యన్‌ను ఆశ్చర్యపరిచింది. నష్టం వివరాలు ఇంకా తెలియకపోయినప్పటికీ రష్యన్ అయితే భారీగా నష్టపోయింది.
ఇక డ్రోన్ల దాడి తర్వాత జెలెన్‌స్కీ ఇలా పోస్టు చేశారు. ఈ ఆపరేషన్‌కు స్పైడర్ వెబ్‌గా నామకరణం చేశారు. స్పైడర్ వెబ్ కచ్చితంగా అద్భుతమైన ఫలితం సాధించిందని పేర్కొన్నారు. ఇది ఉక్రెయిన్ మాత్రమే సాధించిన ఫలితం. అమెరికా మద్దతు లేకుండా దాడి చేయడంతో ట్రంప్‌కు జెలెన్‌స్కీ ఒక సందేశం పంపించినట్లైంది.
ఇటీవల పాకిస్థాన్‌పై భారత్ కూడా దాడి చేసింది. దీనికి ఆపరేషన్ సిందూర్ అని నామకరణం చేశారు. ఈ ఆపరేషన్ సిందూర్ కూడా పాకిస్థాన్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. కేవలం స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆయుధాలనే భారత్ ప్రయోగించింది. దీంతో భారీ స్థాయిలో పాకిస్థాన్‌లో నష్టం జరిగింది. అదే మాదిరిగా తాజాగా ఉక్రెయిన్.. రష్యాపై దాడి చేసింది. దీనికి స్పైడర్ వెట్‌గా పేరు పెట్టారు.
Head of the Security Service of Ukraine Vasyl Maliuk delivered a report regarding today’s operation. An absolutely brilliant result. A result achieved solely by Ukraine. One year, six months, and nine days from the start of planning to effective execution. Our most long-range… pic.twitter.com/oN41NFYyfw
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) June 1, 2025
Ukrainian "Pavutyna" (spider net) operation is today's attack launched simultaneously on four russia's strategic aviation airbases has reportedly destroyed 40 (forty) strategic bombers on 4 (four) airbases: Belaya (4700 km from Ukraine), Dyagilevo (700 km), Olenya (2000 km),… pic.twitter.com/AYr5g7Xr7L
— Sergej Sumlenny, LL.M (@sumlenny) June 1, 2025