Vladimir Putin Says West Wants To "Tear Apart" Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి 10 నెలలు పూర్తయ్యాయి. అయినా ఇప్పడప్పుడే యుద్ధం ఆగే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. వెస్ట్రన్ దేశాలు రష్యాను విచ్ఛిన్నం చేయడాని ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని సమర్థించారు పుతిన్. ఇది రష్యన్లను ఏకం చేయడానికే అని అన్నారు. ఉక్రెయిన్లు కూడా రష్యన్లే అని ఆయన అన్నారు.