Russian missiles hit Ukraine port: రష్యా, ఉక్రెయిన్ పోర్టులను బ్లాక్ చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా ధాన్యం కొరత ఏర్పడింది. అయితే శుక్రవారం ఉక్రెయన్ పోర్టుల నుంచి ధాన్యం రవాణాకు సేఫ్ గా తరలించేందుకు టర్కీ, ఐక్యరాజ్యసమితి సమక్షంలో రష్యా, ఉక్రెయిన్ లు ఒప్పందం చేసుకున్నాయి. అయితే ఈ ఒప్పందం జరిగిన రోజు వ్యవధిలోనే రష్యా, ఉక్రెయిన్ లోని ప్రధాన పట్టణం ఒడిస్సాపై రాకెట్లతో విరుచుకుపడింది. ఒడెసాలోని నౌకాశ్రయంపై దాడి చేసింది. ఒడెసా నగరంలోని ధాన్యం నిల్వచేసే ప్రాంతాన్ని రష్యా మిసైళ్లతో టార్గెట్ చేసింది.
అయితే ఈ దాడిని ఐక్యరాజ్య సమితితో పాటు యూరోపియన్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్, జర్మనీ మరియు ఇటలీ తీవ్రంగా ఖండించాయి. అయితే ఈ ఒప్పందంలో రష్యాను నమ్మలేమని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలన్ స్కీ అన్నారు. రష్యా దాడిని అనాగరికమైన చర్యగా అభివర్షించాడు. బ్లాక్ సీ నుంచి ధాన్యం ఎగుమతులు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని.. ఉక్రెయన్ మంత్రి ప్రకటించారు. మరో వారం రోజుల్లో ఒప్పందం అమలు లోకి వస్తుందని యూఎన్ అధికారులు ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ దాడులతో రష్యాకు ఎలాంటి సంబంధం లేదని.. రష్యా అధికారులు తమకు చెప్పినట్లుగా టర్కీ రక్షణ మంత్రి తెలిపారు. రష్యా కూడా ఈ దాడిని ధ్రువీకరించలేదు. అమెరికా విదేశాంగ కార్యదర్శి మాట్లాడుతూ.. ఒడెసాపై దాడి రష్యా నిబద్ధతను, విశ్వసనీయతను ప్రశ్నిస్తుందని అన్నారు. రష్యా ప్రపంచ ఆహార సంక్షోభాన్ని తీవ్రం చేస్తుందని మండిపడ్దారు.
Read Also: Imran Khan: పాకిస్తాన్ లో కూడా శ్రీలంక తరహా ఉద్యమం వస్తుంది.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఆహార సంక్షోభ పరిస్థితులు తలెత్తుతున్నాయి. ప్రపంచంలో గోధుమలు ఎక్కువగా పండించే దేశాల్లో ఉక్రెయిన్ ఒకటి. అయితే ఉక్రెయిన్ పోర్టులను రష్యా దిగ్భంధించడంతో 5 మిలియన్ టన్నుల ధాన్యం చిక్కుకుపోయింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా సప్లై చైన్ దెబ్బతింది. తాజాగా ఉక్రెయిన్, రష్యాల మధ్య జరిగిన ఒప్పందంతో అయినా.. ఆహార సమస్యలు తీరుతాయని అనుకున్నప్పటికీ.. రష్యా దాడి మళ్లీ ప్రశ్నల్ని రేకెత్తిస్తోంది.