Joe Biden: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. నవంబరు 5న దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. దీని కారణంగా డెమోక్రాట్, రిపబ్లికన్ పార్టీలలో రాజకీయాలు తీవ్రరూపం దాల్చుతున్నాయి.
America : ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ దేశాన్ని నడిపించే అర్హతను కలిగి ఉన్నారని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ శుక్రవారం అన్నారు. బిడెన్ మాట్లాడుతూ.. మొదటి నుండి ఆమె అధ్యక్షురాలిగా అర్హత కలిగి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Trump sues CNN claiming defamation: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచారు. సీఎన్ఎన్ మీడియా సంస్థపై ఏకంగా 475( సుమారుగా 3,900కోట్లు) మిలియన్ డాలర్లకు పరువునష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కలిగించేలా సీఎన్ఎన్ వార్తకథనాలు ప్రచురించిందని కోర్టులో సమర్పించిన వ్యాజ్యంలో పేర్కొన్నారు ట్రంప్. తనకు వ్యతిరేకంగా తప్పుడు వార్తకథనాలను ప్రచారం చేసిందని పేర్కొన్నారు. ఫ్లోరిడాలోని యూఎస్ డిస్ట్రిక్ కోర్టులో 29 పేజీల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
Donald Trump: మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చిక్కులు తప్పేలా లేవు. అధ్యక్షుడిగా అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కొన్ని రహస్య పత్రాలను తనతో తీసుకెళ్లినట్లుగా..గూఢచర్య చట్టాన్ని ఉల్లంఘించడం, న్యాయాన్ని అడ్డుకోవడం, ప్రభుత్వం రికార్డులను నేరపూరితంగా నిర్వహించడం వంటి అభియోగాలను ఎదుర్కొంటున్నారు. యూఎస్ లా డిపార్ట్మెంట్ ట్రంప్ పై విచారణ చేస్తోంది. ఇప్పటికే ఎఫ్ బీ ఐ ఏజెంట్లు ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసం మార్-ఏ-లాగో ఇంటిలో పెద్ద ఎత్తున సోదాలు చేసింది. అయితే ఆ…
మరోసారి అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఇటీవల కాలంలో తుపాకీ కాల్పుల ఘటనల్లో అమాయకులు మరణిస్తున్నారు. తాజాగా మరోసారి అలాంటి ఘటనే జరిగింది. శనివారం తెల్లవారుజామున సీటెల్ శివారు రెంటల్ ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. ఐదుగురు గాయపడ్డారు.
సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు అగ్రరాజ్యాన్ని సైతం వణికిస్తోంది… యూఎస్‌లో పెద్ద సంఖ్యలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. గణాంకాలను పరిశీలిస్తే.. గత వారం రోజుల్లో నమోదైన మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల్లో 73 శాతం ఒమిక్రాన్ కేసులే ఉన్నాయంటే.. ఒమిక్రాన్ ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో అర్థం చేసుకోవచ్చు.. ఇక, న్యూయార్క్ ఏరియాలో తాజా కేసుల్లో 90శాతానికిపైగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులే ఉండడం కూడా ఆందోళన కలిగిస్తోంది.. గత వారం…
భారత ప్రధాని నరేంద్ర మోడీ-అమెరికా అధ్యక్షుడు జో బైడన్ సమావేశంపై అధికారికంగా ప్రకటన చేసింది వైట్ హౌస్.. సెప్టెంబర్ 24న జో బైడెన్, నరేంద్రమోడీ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనుందని వెల్లడించింది.. కాగా, ప్రధాని మోడీ.. ఈ వారమే అమెరికా వెళ్లనున్నారు. బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నరేంద్ర మోడీ.. అమెరికా వెళ్లడం ఇదే మొదటిసారి.. గతంలో వర్చువల్ ద్వారా జరిగిన క్వాడ్ సమ్మిట్, క్లైమేట్ చేంజ్ సమ్మిట్, జీ-7 సమావేశాల్లో పాల్గొన్నారు.…