US-Iran Tension: గాజా ‘‘బోర్డ్ ఆఫ్ పీస్’’ కార్యక్రమం జరిగిన వెంటనే అమెరికా ఇరాన్‌పై దాడులకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఇరాన్ వ్యాప్తంగా జరిగిన ప్రభుత్వం వ్యతిరేక నిరసనల్ని మత పాలకులు అణిచివేశారు. అయితే, దీనిని సాకుగా చూపుతూ యూఎస్ దాడులకు సిద్ధమవుతుందా?
Donald Trump: ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ దిగిపోయే సమయం వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్ వ్యాప్తంగా వారాల తరబడి ఎగిసిపడిన నిరసనల తర్వాత అమెరికా నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ‘‘ఇరాన్‌లో కొత్త నాయకత్వం కోసం వెతకాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని అన్నారు.
Iran: ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నష్టాలకు, ప్రాణ నష్టాలకు, నిందలకు డొనాల్డ్ ట్రంప్ కారకుడని ఆరోపించారు. ట్రంప్ ఒక ‘‘నేరస్తుడు’’ అని అభివర్ణించారు. అమెరికానే ఇరాన్‌లో అశాంతిని సృష్టిస్తోందని ఖమేనీ అన్నారు.
Iran: దేశ వ్యాప్తంగా చెలరేగుతున్నఆందోళనల్ని ఇరాన్ అణచివేయాలని చూస్తోంది. అయతొల్లా అలీ ఖమేనీ మతపాలనకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు ఉద్యమిస్తున్నారు. వందలాది మంది ఇప్పటికే మరణించారు. అయితే, ఈ నిరసనలతో సంబంధం ఉన్నవారిని అక్కడి ప్రభుత్వ కఠినంగా శిక్షించేందుకు సిద్ధమైంది. తాజాగా, మొదటి ఉరిశిక్షను అమలు చేయాడానికరి ఇరాన్ అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 26 ఏళ్ల ఎర్ఫాన్ సొల్తానీకి త్వరలో మరణశిక్ష అమలు చేయనున్నారు.
Trump: ప్రజా ఉద్యమంతో ఇరాన్ అట్టుడుకుతోంది. సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మతపాలనకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చారు. రాజధాని టెహ్రాన్‌తో పాటు అన్ని ప్రావిన్సుల్లో ప్రజాందోళన ఎగిసిపడుతోంది. ఇదిలా ఉంటే, ఈ ఉద్యమాన్ని బలవంతంగా అణిచివేసేందుకు ఖమేనీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
Iran Warns Protests: ఇరాన్‌లో గత రెండు వారాలుగా కొనసాగుతున్న భారీ నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తుంది. ఇరాన్ అటార్నీ జనరల్ మొహమ్మద్ మొవాహెది అజాద్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు.
Iran Protests: ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇరాన్‌లో మత ప్రభుత్వాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ‘‘నియంతకు మరణం’’, ‘‘ముల్లాలు వెళ్లిపోవాలి’’ అంటూ నినాదాలు చేస్తున్నారు.
Iran Protests: ఇరాన్‌లో నిరసనలు తీవ్రమవుతున్నాయి. సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మత పాలనకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. ‘‘నియంతకు మరణం’’, ‘‘జావిద్ షా’’ నినాదాల తర్వాత ఇప్పుడు మరో నినాదం ఖమేనీ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. శుక్రవారం నాటికి నిరసనలు ప్రారంభమై 13 రోజులకు చేరుకుంది. భారీ నిరసనల మధ్య ఖమేనీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ను నిలిపేసింది. ‘‘గాజా కాదు, లెబనాన్ కాదు, నా ప్రాణం
Iran Protests: వెనిజులా సైనిక చర్య నేపథ్యంలో, అమెరికా ఇరాన్‌లో ఏదైనా సైనిక చర్య చేపడుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే, ఇరాన్ వ్యాప్తంగా ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ద్రవ్యోల్భణం, నిరుద్యోగం, ప్రభుత్వంపై ఉద్యమాన్ని తీవ్రం చేస్తున్నారు. ఇప్పటికే, ఈ అల్లర్లలో 30 మందికి పైగా చనిపోయారు. మరోవైపు, బలవంతంగా ఇరాన్ ప్రభుత్వం, నిరసనకారులపై కాల్పులు జరిపితే చూస్తూ ఊరుకోబోమని అమెరికా ఇప్పటికే ప్రకటించింది.
ఇరాన్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఖమేనీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నాయి.