H-1B visa: H-1B వీసా ఫీజును పెంచుతూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొత్త దరఖాస్తుదారులకు లక్ష డాలర్లు(రూ. 88లక్షలు) ఫీజు విధించాడు. ముఖ్యంగా, దీని ప్రభావం భారతీయ టెక్కీలపై ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే, మొత్తం హెచ్1బీ వీసాల్లో 70 శాతం భారతీయులే ఉన్నారు. అయితే, హెచ్1బీ వీసాల విషయంలో మరిన్ని కఠిన నిర్ణయాలు ఉంటాయని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చెబుతోంది.
Trade Talks: అమెరికా, భారత్ మధ్య సంబంధాలను ‘‘సుంకాలు’’ దెబ్బతీశాయి. ప్రపంచంలో, అత్యధికంగా భారత్‌పై అమెరికా 50 శాతం సుంకాలు విధించింది. ఇందుల్లో 25 శాతం పరస్పర సుంకాలు కాగా, రష్యా నుంచి చమురు కొంటున్నందుకు మరో 25 శాతం సుంకాలు విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ టారిఫ్ టెన్షన్ మధ్య, సెప్టెంబర్ 22న వాణిజ్య చర్చల కోసం వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ అమెరికా వెళ్తున్నారు. వాణిజ్య చర్చలకు కోసం అమెరికా వెళ్లే…
H-1B visa: H-1B visa వీసాపై డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయ టెక్కీలో తీవ్ర ఆందోళన పెంచింది. వీసాల కోసం ఏకంగా USD 100,000 (రూ. 88 లక్షలు) చెల్లించాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఈ నిర్ణయం అమెరికన్ డ్రీమ్ ఉన్న యువతను కంగారు పెట్టింది. ముఖ్యంగా, హెచ్1బీ వీసా కలిగిన వారిలో భారతీయులే 70 శాతం మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.
USA: రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపితేనే భారతదేశంతో వాణిజ్య ఒప్పందం ముందుకు సాగుతుందని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ అన్నారు. భారత్‌తో వాణిజ్యం, రష్యన్ ఆయిత్ దిగుమతులు ఆపివేయడంపై ఆధారపడి ఉంటుందని అన్నారు. ట్రంప్ 50 శాతం సుంకాలతో ఇరు దేశాల ఉద్రిక్తతల మధ్య లుట్నిక్ ఈ వ్యాఖ్యలు చేశారు.
సుంకాలు కారణంగా భారత్-అమెరికా మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ప్రస్తుతం సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో అమెరికా అధికారులు మరింత ఆజ్యం పోస్తున్నారు. పుండి మీద కారం చల్లినట్లుగా రెచ్చగొట్టే ప్రేలాపనలు చేస్తున్నారు.
Tariff Deadline: సుంకాల విధింపుకు సంబంధించి డెడ్‌లైన్ గురించి అమెరికా క్లారిటీ ఇచ్చింది. సుంకాలు విధించడానికి ఆగస్టు 1నాటి తుది గడువు ఎట్టి పరిస్థితుల్లో మారదని, ఎలాంటి పొడగింపులు ఉండవని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ఆదివారం చెప్పారు. ‘‘ఇక పొడగింపులు లేవు, ఇక గ్రేస్ పిరియడ్‌లు లేవు. ఆగస్టు 1న, సుంకాలు నిర్ణయించబడ్డాయి. అవి అమలులోకి వస్తాయి. కస్టమ్స్ డబ్బు వసూలు చేయడం ప్రారంభిస్తాయి.’’ అని ఓ అన్నారు.