Ukraine Crisis Ukraine Crisis: దారుణం.. సమాధులు తవ్వుతున్న ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్ -రష్యా యుద్ధం తీవ్ర దశలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.. అక్కడి ప్రజలకు ఎప్పుడు ఎక్కడినుంచి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని ఆ భయానక పరిస్థితుల్లో, అనేక మంది తమవారికి సక్రమంగా తుది వీడ్కోలు పలకలేని నిస్సహాయ స్థితిలో మిగిలిపోయారు. ఈనేపథ్యంలో.. ప్రస్తుతం పరిస్థితులు కాస్త మెరుగుపడటం వల్ల లుహాన్స్క్ రీజియన్‌లోని రూబిజ్నే పట్టణ ప్రజలు యుద్ధం తారస్థాయిలో ఉన్నప్పుడు హడావుడిగా మృతదేహాలను ఖననం చేయించారు. ఇప్పుడు ఆ మృతదేహాలను వెలికితీస్తున్నారట. ఆ మృతదేహాలను మళ్లీ వాటికి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. అక్కడ దాదాపు 50 వేల జనాభా ఉన్న ఈ పట్టణం ప్రస్తుతం రష్యా మద్దతుకలిగిన లుహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ (ఎల్‌పీఆర్) ఆధీనంలో ఉంది.
ఉక్రెయిన్ -రష్యా యుద్ధ సమయంలో ధ్వంసమైన ఓ అపార్ట్‌మెంట్ బ్లాక్ వెలుపల ఇటీవల ఓ కందకాన్ని (గుంతను) తిరిగి తవ్వారు. దానిలోంచి ఆరు మృతదేహాలను వెలికితీశారు. దీంతో లిలియా అనే స్థానికురాలు తన తల్లి మృతదేహానికి చుట్టిన దుప్పటి ఆధారంగా ఆమెను గుర్తుపట్టారు. యుద్ధ దాడుల సమయంలో 10 రోజులపాటు తన తల్లిదండ్రుల అపార్ట్‌మెంట్‌కు చేరుకోలేకపోయానని, ఆమె అప్పటికే మరణానికి చేరువైందని, చేతులు నీలి రంగులోకి మారాయని, ముఖం వాడిపోయిందని, మరుసటి రోజే ఆమె మరణించిందని ఆమె కన్నీరుపెట్టుకున్నారు. ఈనేపథ్యంలో.. ఎడతెగని దాడులతో అంత్యక్రియలు సరిగ్గా నిర్వహించలేని దుస్థితి ఏర్పడిందని భావోద్వేగానికి గురైంది. ఆపరిస్థితుల్లోనే తన తల్లి మృతదేహాన్ని బహిరంగ కందకంలో ఖననం చేయాల్సి వచ్చిందని తెలిపారు. అయితే.. ఇప్పుడు ఆమె మృతదేహాన్ని శ్మశానవాటికలో పూడ్చుతాఅని వివరించారు.
Also Read
- Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం.. 5.8 తీవ్రతతో కంపించిన భూమి
- Iran Trolls Trump: ట్రంప్‌ను టీజ్ చేసిన ఇరాన్.. బాలయ్య ‘భగవంత్ కేసరి’ క్లిప్‌తో కౌంటర్
- MV Cape Dao Attack: ఒమన్ తీరంలో MV Cape Daoపై దాడి.. భారతీయ నావికుడు మృతి
- Xi Jinping Arrives in America: అమెరికా గడ్డపై షీ జిన్‌పింగ్.. ఆండ్రూస్ ఎయిర్‌బేస్‌కు వెళ్లి మరీ స్వాగతించిన ట్రంప్
దీంతో తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా మద్దతుగల లుహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ ప్రస్తుతం మృతదేహాల వెలికితీత ప్రక్రియ కొనసాగుతుంది. ఈసందర్భంగా.. ఎల్‌పీఆర్ అధికారి అన్నా సోరోకినా మాట్లాడుతూ ఇటీవల ఒక బృందం రూబిజ్నేలో 10 రోజుల వ్యవధిలో 104 మృతదేహాలను వెలికితీసినట్లు, ఇలా నగరంలో దాదాపు 500 వరకు సామూహిక సమాధులు ఉన్నట్లు అంచనా వేశారు. కాగా.. ఇప్పటివరకు బయటపడిన మృతదేహాలకు చాలావరకు క్షిపణి.. బాంబు దాడుల గాయాలున్నాయని తెలిపారు. కొన్నింటికి బుల్లెట్ గాయాలు కూడా ఉన్నాయని, మరొకొన్ని గుర్తుతెలియని మృతదేహాలను గుర్తించేందుకు డీఎన్‌ఏ నమూనాలు సేకరిస్తున్నట్లు అన్నా సోరోకినా వెల్లడించారు.
Vijayendra Prasad: ‘బాహుబలి’ రచయితనే స్టార్ హీరోలు పక్కన పెట్టేస్తున్నారట..?
తాజావార్తలు
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం.. 5.8 తీవ్రతతో కంపించిన భూమి
-
DoT SIM Card Warning: మీ పేరు మీద సిమ్‌ను వేరొకరు వాడుతున్నారా? మీకు రూ.50 లక్షల వరకు జరిమానా!, పైగా శిక్ష..
-
Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
-
Danam Nagender: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!