Vijayendra Prasad: టాలీవుడ్ సీనియర్ రచయిత, దర్శక ధీరుడు విజయేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటీవలే రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన ఆయన ప్రస్తుతం సినిమా కథలపై కూడా దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి రచయిత గా కాకుండా దర్శకుడిగా కూడా మారడానికి ప్రయత్నిస్తున్నాడట. ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ రాజన్న, శ్రీవల్లీ అనే సినిమాలకు దర్శకత్వం వహించాడు. కానీ, ఈ సినిమాలు ఆయనకు విజయాన్ని తెచ్చిపెట్టలేకపోయాయి. ఇక ముచ్చటగా మూడోసారి డైరెక్టర్ గా ప్రయత్నం చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది.
తన దగ్గర ఉన్న కథను ఒక స్టార్ హీరోతో చేయాలనీ ప్రయత్నిస్తున్నాడట ఈ రచయిత. ఇందుకోసం నలుగురు స్టార్ హీరోలను కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని టాక్ నడుస్తోంది. వారికి కథ నచ్చలేదా..? లేక ఈయనతో చేయడం ఇష్టం లేదా..? అనేది తెలియదు కానీ సున్నితంగా తప్పుకున్నారని మాత్రం తెలుస్తోంది. ఏదిఏమైనా తాను అనుక్కున్నది సాధించడం కోసం విజయేంద్ర ప్రసాద్ శ్రమిస్తూనే ఉన్నాడట.. ఈ కథను స్టార్ హీరోతో మాత్రమే చేయాలనీ కంకణం కట్టుకున్నాడట. మరి ఏ స్టార్ హీరో ఈ కథను ఓకే చేస్తాడో చూడాలి అంటున్నారు అభిమానులు.