Turkey: పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌పై టర్కీ అధ్యక్షుడు ప్రశంసలు
- నాలుగు దేశాల పర్యటనలో పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్
- పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌పై టర్కీ అధ్యక్షుడు ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ నాలుగు దేశాల పర్యటనలో ఉన్నారు. ఇక టర్కీ రాజధాని అంకారాలో ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ ప్రత్యేకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన్ను అభినందించారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య సంబంధాలు పెంచుకోవాలని ఆకాంక్షించారు.
ఇది కూడా చదవండి: TVS Jupiter 125: సరికొత్త స్టైల్, పవర్, పర్ఫార్మన్స్ లతో లాంచ్‌కు సిద్ధమైన కొత్త టీవీఎస్ జూపిటర్ 125..!
Also Read
- Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్‌తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
- US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ రెచ్చగొట్టే ప్రసంగం చేసిన తర్వాతే ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడి జరిగింది. మతం పేరుతో 26 మందిని ఉగ్రవాదులు చంపేశారు. అనంతరం భారత్.. పాకిస్థాన్‌పై కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపేసింది. వీసాలను రద్దు చేసింది. అటారీ సరిహద్దు నిలిపేసింది. అనంతరం మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఘటనలో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతరం పాకిస్థాన్-భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌కు టర్కీ ఆయుధాలు సరఫరా చేసింది. టర్కీ అందించిన ఆయుధాలనే పాకిస్థాన్.. భారత్‌పై ప్రయోగించింది.
ఇది కూడా చదవండి: Godavari River Tragedy: గోదావరిలో గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు.. ఒక మృతదేహం లభ్యం!
టర్కీపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సోషల్ మీడియా వేదికగా బాయ్‌కట్ టర్కీ అంటూ నినదించారు. టర్కీ పర్యాటరంగాన్ని నిషేధించారు. అలాగే అక్కడ వస్తువులు కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం టర్కీ బాయ్‌కట్ నడుస్తోంది.

ఇదిలా ఉంటే ఇరాన్ పర్యటనలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్, జల వివాదం, ఉగ్రవాదంపై భారత్‌తో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. కాశ్మీర్ సమస్యను, నీటి సమస్యను.. అన్ని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. వాణిజ్యం, ఉగ్రవాదం నిర్మూలనపై కూడా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. శాంతి ప్రయోజనాల కోసం భారత్‌తో శాంతి చర్చల్లో పాల్గొనడానికి సిద్ధమని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను భారత్ అంగీకరిస్తే.. నిజంగానే వారు శాంతిని కోరుకుంటున్నారని అర్థమవుతుందని షరీఫ్ వ్యాఖ్యానించారు.

ఇటీవల విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌తో చర్చలు జరిగితే పూర్తిగా ద్వైపాక్షికంగా ఉంటాయని.. ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పైనే ఉంటుందని తేల్చి చెప్పారు. ఇక ప్రధాని మోడీ సోమవారం గుజరాత్లో పర్యటిస్తూ.. పాకిస్థాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్థాన్ పౌరులు శాంతిని కోరుకోకపోతే భారత సైన్యం ఆగ్రహాన్ని ఎదుర్కోవల్సి వస్తుందని చెప్పారు. ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటే రోటీ తినండి.. లేదంటే బుల్లెట్ దిగుతుందని హెచ్చరించారు.
ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది చనిపోయారు. అనంతరం భారత్.. పాకిస్థాన్ పట్ల కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపివేసింది. వీసాలు రద్దు చేసింది. అటారీ సరిహద్దు నిలిపివేసింది. అనంతంర మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీంతో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి. అనంతరం పాకిస్థాన్ కాళ్లు బేరానికి రావడంతో కాల్పుల విరమణకు భారత్ అంగీకరించింది.
తాజావార్తలు
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!